Home News లీకైన Realme 10 4G ఇండియన్ వేరియంట్ ర్యామ్, స్టోరేజీ వివరాలు

లీకైన Realme 10 4G ఇండియన్ వేరియంట్ ర్యామ్, స్టోరేజీ వివరాలు

హైలైట్స్

Realme కంపెనీ ఇటీవలె Realme 10 4G స్మార్ట్ ఫోన్ ని గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ చేసింది. ఓవైపు రియల్మీ 10 ప్రో సిరీస్ భారత లాంచ్ కోసం ఎదురు చూస్తోన్న క్రమంలో, Realme 10 4G తొలుత లాంచ్ కానుందని ఓ వార్త బయటకు వచ్చింది. ప్రముఖ టిప్‌స్టర్ సుదాన్శు అంబోరే ద్వారా ఈ విషయం 91మొబైల్స్ కి తెలిసింది. అలాగే Realme 10 4G యొక్క ఏయే వేరియంట్స్ భారత్ లో అందుబాటులోకి రానున్నాయో తెలుసుకుందాం. పదండి.

Realme 10 4G భారత వేరియంట్ మెమొరీ ఆప్షన్స్

సుదాన్శు తెలిపిన దాన్ని బట్టి, Realme 10 4G మూడు మెమొరీ వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి: 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ బేస్ వేరియంట్, 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మిడ్-వేరియంట్, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ టాప్ వేరియంట్. అంటే భారత్ లో 6జిబి/128జిబి మరియు 8జిబి/128జిబి వేరియంట్లను రియల్మీ తీసుకురావడంలేదని తెలుస్తోంది. గ్లోబల్ మార్కెట్ లో Realme 10 4G 5 మెమొరీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది.

Realme 10 4G స్పెసిఫికేషన్స్

Realme 10 4G స్మార్ట్ ఫోన్ లో 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటాయి. Realme 10 4G లో మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్ వినియోగించారు. 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ తో ఈ ఫోన్ లభించనుంది. Realme 10 4G డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 3.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Realme 10 4G యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Realme 10 4G లో 50 ఎంపి కెమెరా, 2 ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. Realme 10 4G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఇచ్చారు.

భారత్ లో Realme 10 4G ధర (అంచనా)

Realme 10 4G స్మార్ట్ ఫోన్ 4జిబి + 64జిబి వేరియంట్ ధర రూ.15,000 గా ఉండే అవకాశం ఉంది. 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ యూనిట్ ధర రూ.17000 గా ఉండనుంది. ఇక టాప్ వేరియంట్ అయిన 8జిబి ర్యామ్ + 256జిబి వేరియంట్ ధర రూ.20,000 గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక గ్లోబల్ వేరియంట్స్ ధర 229 డాలర్లు (సుమారు రూ.18,700) తో మొదలై 299 డాలర్లు (సుమారు రూ.24,400) వరకు ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.