హైలైట్స్
- నవంబర్ 9 న లాంచ్ అవుతోన్న Realme 10 4G, ప్రకటించిన కంపెనీ
- నవంబర్ 11 నుంచి ఇండోనేషియాలో సేల్ కి అందుబాటులోకి రానున్న డివైజ్
- మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ తో వస్తున్న Realme 10 4G
Realme 10 4G లాంచ్ తేదీ ఖరారైంది. రియల్మీ కంపెనీ ఈ ఫోన్ ని నవంబర్ 9 న లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇండోనేషియాలో నవంబర్ 11 నుంచి Realme 10 4G అమ్మకానికి వస్తోంది. త్వరలోనే ఈ డివైజ్ భారత మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. అయితే కంపెనీ భారత లాంచ్ కి సంబంధించిన వివరాలను ఇంకా వెల్లడించాల్సి ఉంది. ఈలోపు రియల్మీ అధికార వెబ్ సైట్ లో Realme 10 4G కి సంబంధించిన స్పెసిఫికేషన్స్, డిజైన్ వివరాలు రివీల్ అయ్యాయి.
Realme 10 4G డివైజ్ ఇండోనేషియాలో రెండు కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. మూడు విభిన్న స్టోరేజీ ఆప్షన్స్ లో ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. Realme 10 4G మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్ తో వస్తోంది. Realme 10 4G యొక్క స్పెసిఫికేషన్స్, ఫీచర్లు, ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకుందాం పదండి.
Realme 10 4G స్పెసిఫికేషన్స్
నవంబర్ 11 నుంచి అధికారికంగా Realme 10 4G డివైజ్ ని కొనుగోలు చేయవచ్చు. ఇండోనేషియాలో మూడు వేరియంట్లలో ఈ ఫోన్ లాంచ్ అవుతోంది. బేస్ వేరియంట్ 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో వస్తోంది. ఇంకా 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. రష్ వైట్, క్లాష్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ డివైజ్ లభించనుంది.
ప్రస్తుతానికి ధర వివరాలు రహస్యంగా ఉన్నాయి. నవంబర్ 9 న రియల్మీ సంస్థ Realme 10 4G యొక్క ధరను రివీల్ చేయనుంది. Realme 10 4G 4జిబి ర్యామ్ మోడల్ ధర 190-210 డాలర్లు (రూ.15,700-రూ.17,200) మధ్య ఉంటుందని ఇదివరకు మేం రివీల్ చేశాం.
రియల్మీ ఇండోనేషియా వెబ్ సైట్ లో Realme 10 4G యొక్క ఇతర వివరాలు ఖరారయ్యాయి. ఈ ఫోన్ 90 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, హోల్-పంచ్ కటౌట్ తో రానుంది. అయితే డిస్ప్లే సైజుకి గురించి ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. Realme 10 4G 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే తో వస్తుందని ఇంతకు ముందు మేం రివీల్ చేశాం. అలాగే 360హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ కూడా ఉంటుందని మేం చెప్పాం.
Realme 10 4G 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోంది. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. Realme 10 4G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉంటాయి.
Realme 10 4G 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఫీచర్ తో వస్తోంది. ఈ ఫీచర్ సాయంతో ఇంటర్నల్ మెమొరీని ర్యామ్ గా మార్చుకోవచ్చు. మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ AnTuTu బెంచ్ మార్కింగ్ ప్లాట్ఫామ్ పై 4 లక్షల స్కోర్ ని నమోదు చేసిందని రియల్మీ కంపెనీ వెల్లడించింది.
Realme 10 4G లో భద్రత కోసం ఫింగర్ ప్రింట్ స్కానర్, ఏఐ ఫేస్ అన్‌లాక్ ని అందించారు. ఈ ఫోన్ లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపి కెమెరాను అందించారు. Realme 10 4G ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 3.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
Realme 10 4G లో ఉన్న హార్డ్‌వేర్ ని బట్టి, భారత్ లో ఈ ఫోన్ బేస్ మోడల్ ధర రూ.17,000 గా ఉండే అవకాశం ఉంది. అన్ని కార్డ్ ఆఫర్లను కలుపుకుని భారత్ లో Realme 10 4G డివైజ్ ని రూ.15,000 కే సొంతం చేసుకునే చాన్స్ ఉంది. త్వరలోనే Realme 10 4G ఇండియా లాంచ్ కి సంబంధించిన ప్రకటను రియల్మీ చేసే అవకాశం ఉంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.