హైలైట్స్
- నవంబర్ లో లాంచ్ కానున్న Realme 10 సిరీస్
- డిజైన్, డిస్ప్లే, పెర్ఫామెన్స్ పరంగా కొత్త టెక్నాలజీతో Realme 10 సిరీస్ వస్తున్నట్లు ప్రకటించిన వైస్ ప్రెసిడెంట్ మాధవ్ సేఠ్
- మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ తో రానున్న Realme 10 Pro+
Realme కంపెనీ తన Realme 9 సిరీస్ లో ఇప్పటి వరకు 7 స్మార్ట్ ఫోన్స్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ సంస్థ Realme 10 సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. వచ్చే నెలలో ఈ లాంచ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ లైనప్ లో Realme 10, Realme 10 Pro, Realme 10 Pro+ అనే మోడల్స్ ఉండనున్నాయి.
Realme 10 సిరీస్ లాంచ్ కి సంబంధించిన సమాచారాన్ని రియల్మీ సంస్థ వైస్ ప్రెసిడెంట్ మాధవ్ సేఠ్ ఇచ్చారు. Realme 10 సిరీస్ నవంబర్ లో లాంచ్ అవుతుందని ఆయన తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించారు. లాంచ్ సమాచారం ఇవ్వడంతో పాటు, Realme 10 సిరీస్ పెర్ఫామెన్స్, డిజైన్, డిస్ప్లే విషయంలో కొత్త టెక్నాలజీతో రాబోతుందని ఆయన చెప్పారు.
The 3 major leap-forward technologies are Performance, Design & Display ? Did you get them right? And yupp, the new #realme Number Series will be launched in Nov!! Hit the ? if you can't wait. https://t.co/CrZLrAGPr9
— realme (@realmeglobal) October 26, 2022
Realme 10 Pro+
ప్రస్తుతం ఇక్కడ చెప్పుకోబోయే సమాచారం రియల్మీ కంపెనీ నుంచి అధికారికంగా వచ్చింది కాదు. ఇది కొన్ని లీకుల ద్వారా బహిర్గతమైన సమాచారం. ఆ సమాచారం ప్రకారం, Realme 10 Pro+ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ తో రానుందని తెలుస్తోంది. మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్ ని కూడా Realme 10 సిరీస్ లో వాడే అవకాశం ఉందని ఇదివరకు వార్తలు వచ్చాయి. లాంచ్ తర్వాతే ఈ విషయాలపై పూర్తి క్లారిటీ రానుంది.
Realme 10 Pro+ స్మార్ట్ ఫోన్ గురించి మాట్లాడుకుంటే, ఈ స్మార్ట్ ఫోన్ 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోందని తెలుస్తోంది. అలాగే ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుందని సమాచారం. ఇంకా Realme 10 స్టాండర్డ్ వేరియంట్ లో కూడా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ స్టాండర్డ్ మోడల్ లో 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉండనుంది. Realme 10 Pro+ స్మార్ట్ ఫోన్ లో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగిన స్క్రీన్ ఉంటాయని లీకైన వార్తల ద్వారా తెలుస్తోంది. అయితే ఈ సమాచారమే కచ్చితమైనదని చెప్పలేం. రానున్న రోజుల్లో కంపెనీ నుంచి ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్ కి సంబంధించిన టీజర్స్ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు స్పెసిఫికేషన్స్ పై మరింత స్పష్టత వస్తుంది.
Realme 10 సిరీస్ యొక్క లాంచ్ తేదీకి సంబంధించిన అధికార ప్రకటన కంపెనీ నుంచి రావాల్సి ఉంది. ఇక Realme 10 సిరీస్ యొక్క ధరల స్థాయిని గురించి మాట్లాడితే, స్టాండర్డ్ వేరియంట్ ధర రూ.13,000 నుంచి మొదలయ్యే అవకాశం ఉంది. ఇకపోతే హై-ఎండ్ వర్షన్ ధర రూ.25,000 గా ఉండే అవకాశం ఉంది. లాంచ్ తర్వాతే అసలైన ధరలు బయటకు వస్తాయి. ఇది కేవలం అంచనా మాత్రమే.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.