హైలైట్స్
- భారత్ లో తొలిసారిగా నేడు సేల్ కి వచ్చిన Realme 10 Pro
- ఈనెల ఆరంభంలో లాంచైన Realme 10 Pro స్మార్ట్ ఫోన్
- 120 హెర్ట్జ్ డిస్ప్లే, 108ఎంపి కెమెరా, స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 8జిబి ర్యామ్ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్
Realme 10 Pro+, Realme 10 Pro స్మార్ట్ ఫోన్స్ ఈ నెల ఆరంభంలో భారత్ లో లాంచ్ అయ్యాయి. Realme 10 Pro+ ఇప్పటికే సేల్ కి రాగా, నేటి నుంచి Realme 10 Pro కూడా విక్రయానికి వచ్చింది. Realme 10 Pro+ కంటే Realme 10 Pro డివైజ్ తక్కువ ధరలో లభిస్తుంది. Realme 10 Pro స్మార్ట్ ఫోన్ 120 హెర్ట్జ్ ఎల్సీడీ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 108ఎంపి మెయిన్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.
భారత్ లో Realme 10 Pro ధర, లభ్యత
Realme 10 Pro నేడు ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి వచ్చింది. ఈ డివైజ్ ని రియల్మీ.కామ్ మరియు ఆఫ్ లైన్ స్టోర్స్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ డివైజ్ మూడు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: హైపర్‌స్పేస్ గోల్డ్, డార్క్ మ్యాటర్, నెబులా బ్లూ. Realme 10 Pro ఫోన్ 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 6జిబి వేరియంట్ ధర రూ.18,999 కాగా, 8జిబి వేరియంట్ ధర రూ.19,999 గా ఉంది.
Realme 10 Pro కొనుగోలు పై బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఎస్బీఐ కార్డ్స్ పై ఈఎంఐ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేస్తే రూ.750 డిస్కౌంట్ లభిస్తుంది. ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డ్ యూజర్స్ ఫోన్ ని ఈఎంఐ కాకుండా కొనుగోలు చేస్తే రూ.1000 డిస్కౌంట్ లభిస్తుంది. హెచ్డీఎఫ్‌సీ కార్డ్ యూజర్లకు కూడా రూ.1000 డిస్కౌంట్ లభిస్తుంది.
Realme 10 Pro స్పెసిఫికేషన్స్
Realme 10 Pro డివైజ్ 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ తో వచ్చింది.
Realme 10 Pro యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108 ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
Realme 10 Pro లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఈ ఫోన్ లో ఉంటాయి. Realme 10 Pro ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.