Home News Realme 10 Pro 5G కర్వ్డ్ డిస్ప్లే ని అఫీషియల్ గా టీజ్ చేసిన కంపెనీ

Realme 10 Pro 5G కర్వ్డ్ డిస్ప్లే ని అఫీషియల్ గా టీజ్ చేసిన కంపెనీ

హైలైట్స్

Realme కంపెనీ త్వరలో Realme 10 సిరీస్ ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ లైనప్ లో Realme 10, Realme 10 Pro 5G, Realme 10 Pro+ 5G అనే మోడల్స్ ఉన్నాయి. స్టాండర్డ్ వేరియంట్ అయిన Realme 10 భారత్ తో పాటు ఇతర మార్కెట్స్ లో 2022, నవంబర్ 9 న లాంచ్ అవుతోంది. ఇక ప్రో వేరియంట్స్ అదే సమయంలో లేదా తర్వాత లాంచ్ అయ్యే అవకాశం ఉంది. నేడు రియల్మీ కంపెనీ Realme 10 Pro 5G/Realme 10 Pro+ 5G యొక్క కర్వ్డ్ డిస్ప్లేని టీజ్ చేసింది. అయితే రెండు ప్రో వేరియంట్స్ లో ఏది కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుందో తెలియదు. లేదంటే రెండు ప్రో మోడల్స్ కూడా కర్వ్డ్ డిస్ప్లేతో వస్తున్నాయేమో చూడాలి.

Realme 10 Pro 5G/Realme 10 Pro+ 5G కర్వ్డ్ డిస్ప్లే ఫస్ట్ లుక్

పైన ప్రమోషనల్ పోస్టర్ లో కనిపిస్తోన్న విధంగా Realme 10 Pro డివైజ్ కర్వ్డ్ డిస్ప్లే తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ లో సెంటర్ పంచ్ హోల్ కటౌట్ ఉంది. ఇందులో సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఫోన్ కి కుడివైపున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఉన్నాయి. Realme 10 Pro అమోలెడ్ ప్యానెల్ 90హెర్ట్జ్/120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తున్నట్లు సమాచారం. అలాగే ప్యానెల్ రెజుల్యూషన్ ఫుల్ హెచ్డీ+ అయి ఉంటుందని అంచనా వేయవచ్చు.

Realme 10 స్పెసిఫికేషన్స్

Realme 10 Pro 5G, Realme 10 Pro+ 5G స్మార్ట్ ఫోన్స్ ఇంకా అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు. అయితే స్టాండర్డ్ వేరియంట్ Realme 10 లాంచ్ అవ్వడం ఖాయమైంది. అఫీషియల్ లిస్టింగ్ ద్వారా ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ పై ఓ క్లారిటీ వచ్చింది. ఓసారి ఆ స్పెసిఫికేషన్స్ పై కన్నేద్దాం పదండి.

Realme 10 స్మార్ట్ ఫోన్ 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. Realme 10 లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ ని వినియోగించారు. ఈ డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ తో వస్తోంది. ఇతర ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్ కూడా ఉంటాయి. కెమెరా విభాగం విషయానికి వస్తే, Realme 10 తో 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటాయి.

Realme 10 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ని అందించారు. Realme 10 లో డ్యూయల్ నానో సిమ్ సపోర్ట్ ఉంటుంది. 4జీ, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.3, 3.5 ఎంఎం ఆడియో జాక్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ Realme 10 లో ఉంటాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.