లాంచ్ కి ముందు రివీల్ అయిన Realme 10 Pro+ 5G డిస్ప్లే ఫీచర్స్

హైలైట్స్

  • నవంబర్ 17 న చైనాలో లాంచ్ కానున్న Realme 10 Pro+ 5G
  • ఈ లైనప్ ఉండే ఫోన్స్ ఇవే: Realme 10, Realme 10 Pro 5G, Realme 10 Pro+ 5G
  • Realme 10 Pro+ 5G డిస్ప్లే ఫీచర్లను రివీల్ చేసిన కంపెనీ

Realme 10 సిరీస్ ని లాంచ్ చేసేందుకు రియల్మీ కంపెనీ రెడీ అవుతోంది. ఈ సిరీస్ తొలుత చైనాలో లాంచ్ అవుతోంది. Realme 10 సిరీస్ లో Realme 10, Realme 10 Pro 5G, Realme 10 Pro+ 5G మోడల్స్ ఉంటాయి. నవంబర్ 17 న మధ్యాహ్నం గంటలకు ఈ సిరీస్ లాంచ్ కానుంది. లాంచ్ కి ముందు, రియల్మీ కంపెనీ Realme 10 Pro+ 5G యొక్క డిస్ప్లే ఫీచర్లను రివీల్ చేసింది. ఈ ఫోన్ కర్వ్డ్ డిస్ప్లే తో రానుంది. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

Realme 10 Pro+ 5G డిస్ప్లేని టీజ్ చేసిన రియల్మీ

పైన కనిపిస్తోన్న ప్రమోషనల్ పోస్టర్ లో Realme 10 Pro+ 5G యొక్క ఫ్రంట్ పార్ట్ కనిపిస్తోంది. డివైజ్ సెంటర్డ్-పంచ్ హోల్ కటౌట్ తో వస్తోంది. ఇందులో సెల్ఫీ కెమెరా కనిపిస్తోంది. Realme 10 Pro+ 5G చిన్ తక్కువగానే ఉంది. మార్కెట్ లో అందుబాటులో ఉన్న బడ్జెట్ ఫ్లాగ్షిప్స్ తో ఈ ఫోన్ పోటీ పడనుంది. Realme 10 Pro+ 5G లో 2.33 ఎంఎం సన్నని చిన్ ఉంటుంది. దీని వల్లన కంపెనీ యొక్క కస్టమైజ్డ్ సీఓపీ అల్ట్రా ప్యాకెజింగ్ ప్రాసెస్ సులభమవుతుంది.

Realme 10 Pro+ 5G 61-డిగ్రీ కర్వ్డ్ డిస్ప్లే ని కలిగి ఉంది. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. రియల్మీ అభివృద్ధి చేసిన ఎక్స్-టచ్ యాంటీ-ఆక్సిడెంటల్ టచ్ ఆల్గారిథమ్ తో వస్తోంది.

Realme 10 Pro+ 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

Realme 10 Pro+ 5G స్మార్ట్ ఫోన్ 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ కర్వ్డ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ని కలిగి ఉంది. Realme 10 Pro+ 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ ని వినియోగించారు. ఈ ఫోన్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీని కలిగి ఉంటుంది.

ఇప్పుడు Realme 10 Pro+ 5G యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Realme 10 Pro+ 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16 ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

Realme 10 Pro+ 5G 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తో వస్తోంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ని కలిగి ఉంది. Realme 10 Pro+ 5G ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 3 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. Realme 10 Pro+ 5G ధర ఇతర వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleఫస్ట్ సేల్: 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో వచ్చిన Nokia G60 5G
Next articleలీకైన OPPO Find N2 ఫోల్డబుల్ ఫోన్ స్పెసిఫికేషన్స్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.