హైలైట్స్
- నవంబర్ 17 న లాంచ్ అవుతోన్న Realme 10 Pro+ 5G స్మార్ట్ ఫోన్
- లాంచ్ కి ముందు లీకైన Realme 10 Pro+ 5G లైవ్ ఇమేజెస్
- 108ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరాతో వస్తోన్న Realme 10 Pro+ 5G
Realme కంపెనీ చైనాలో Realme 10 Pro సిరీస్ ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే కంపెనీ నుంచి Realme 10 4G, 5G వేరియంట్స్ లాంచ్ అయ్యాయి. ఇప్పుడు నవంబర్ 17 న జరిగే ఈవెంట్ లో మరో రెండు మోడల్స్ లాంచ్ కానున్నాయి. అవి: Realme 10 Pro 5G, Realme 10 Pro+ 5G. ఇప్పటికే రియల్మీ Realme 10 Pro+ 5G కి సంబంధించిన పలు వివరాలను టీజ్ చేసింది.
తాజాగా రిలీజ్ అయిన టీజర్ ద్వారా Realme 10 Pro+ 5G యొక్క డిజైన్ రివీల్ అయ్యింది. ఇదివరకే రియల్మీ Realme 10 Pro+ 5G డిజైన్ ని టీజ్ చేసింది. అయితే ఇప్పుడు ఫోన్ యొక్క లైవ్ ఇమేజెస్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. Realme 10 Pro+ 5G యొక్క డిజైన్, స్పెసిఫికేషన్స్ ఇతర వివరాలను తెలుసుకుందాం పదండి.
Realme 10 Pro+ 5G లైవ్ ఇమేజెస్
Realme 10 Pro+ 5G చైనాలో నవంబర్ 17 వ తారీఖున లాంచ్ అవుతోంది. భారత్ లో లాంచ్ అయ్యాక ఇది Realme 9 Pro+ 5G కి సక్సెసర్ గా నిలవనుంది. Realme 10 Pro+ 5G మల్టీ కలర్స్ లో లాంచ్ కానున్నట్లు సమాచారం. ఓ వేరియంట్ మిర్రర్ మాదిరి ఫినిషింగ్ కలిగి ఉండి విభిన్న కోణాల్లో చూసినప్పుడు గ్రేడియంట్ కలర్స్ ని వెదజల్లుతుంది.
Realme 10 Pro+ 5G రియర్ ప్యానెల్ లో రెండు భారీ సర్క్యులర్ కటౌట్స్ ఉన్నాయి. బాటమ్ కటౌట్ లో రెండు కెమెరాలుండగా, ప్రైమరీ కెమెరా పైన కటౌట్ లో ఉంటుంది. సర్క్యులర్ కటౌట్స్ కి పక్కన ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. ఈ డివైజ్ లో 108 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 2 ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. మెయిన్ కెమెరాలో ఓఐఎస్ సపోర్ట్ ఉంటుంది.
Realme 10 Pro+ 5G డివైజ్ కర్వ్డ్ డిస్ప్లేతో వస్తున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది. రియల్మీ ఇప్పటి వరకు డిస్ప్లే సైజ్ ని తెలపలేదు. అయితే లీక్ అయిన సమాచారాన్ని బట్టి 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఈ ఫోన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తోంది.
ఇటీవలె Realme Pro సిరీస్ ఫోన్ గీక్ బెంచ్ వెబ్ సైట్ పై కనిపించింది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్, 12జిబి ర్యామ్ తో వస్తున్నట్లు తెలిసింది. అలాగే 6జిబి/8జిబి ర్యామ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. సెల్ఫీస్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ డివైజ్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 పై ఈ ఫోన్ పని చేస్తుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.