హైలైట్స్
- ఆన్‌లైన్ లో ప్రత్యక్షమైన Realme 10 పోస్టర్, రివీల్ అయిన డిజైన్, కలర్స్, స్పెసిఫికేషన్స్
- బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభించనున్న Realme 10
- 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, మీడియాటెక్ చిప్సెట్స్ తో రానున్న Realme 10 సిరీస్
Realme 10 సిరీస్ లాంచ్ సమయం సమీపిస్తోంది. అయితే మనం అంతవరకు వేచి చూడక్కర్లేకుండా ఈలోపే ఈ సిరీస్ కు సంబంధించిన స్పెసిఫికేషన్స్, డిజైన్, కలర్ ఆప్షన్స్ బయటకు వచ్చాయి. ఈ లైనప్ లో Realme 10 మరియు Realme 10 Pro+ 5G మోడల్స్ ఉంటాయని తెలుస్తోంది. ఇటీవలె Realme 10 Pro+ డివైజ్ సీక్యూసీ మరియు బీఐఎస్ సర్టిఫికేషన్స్ వెబ్ సైట్స్ లో దర్శనమిచ్చింది. Realme 10 సిరీస్ లో ఓఐఎస్ తో కూడిన 50 మెగా పిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుందని తెలుస్తోంది.
లీక్స్ ద్వారా Realme 10 నుంచి ఏమి ఆశించవచ్చో తెలిసిపోయింది. అయితే లేటెస్ట్ లీక్ ద్వారా హ్యాండ్సెట్స్ కి సంబంధించిన కీలక విషయాలు బయటకు వచ్చాయి. మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
Realme 10 డిజైన్ లీక్
లీకైన టీజర్ ని బట్టి, Realme 10 సిరీస్ ఫోన్ బ్లూ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభించనుందని తెలుస్తోంది. అవి: నెబులా బ్లూ, డార్క్ మ్యాటర్. బ్యాక్ ప్యానెల్ పై రెక్టాంగ్యులర్ ఐల్యాండ్ లో ట్రిపుల్ కెమెరా సెన్సర్స్ ఉన్నాయి. బాటమ్ లెఫ్ట్ కార్నర్ లో రియల్మీ బ్రాండింగ్ ఉంది. చూడటానికి ఈ రియల్మీ ఫోన్లు ఐకూ జెడ్6, ఐకూ జెడ్6 ప్రో మాదిరి కనిపిస్తున్నాయి.
మరొక టీజర్ లో Realme 10 యొక్క చైనా లాంచ్ తేదీ రివీల్ అయ్యింది. నవంబర్ 3 న జరిగే 10 వ చైనా మొబైల్ గ్లోబల్ పార్ట్నర్ కాన్ఫరెన్స్ లో Realme 10 సిరీస్ లాంచ్ కానుంది.
ఈ లైనప్ లో Realme 10 మరియు Realme 10 Pro+ 5G మోడల్స్ ఉంటాయని తెలుస్తోంది. ఇటీవలె Realme 10 Pro+ డివైజ్ సీక్యూసీ మరియు బీఐఎస్ సర్టిఫికేషన్స్ వెబ్ సైట్స్ లో దర్శనమిచ్చింది.
Realme 10 స్పెసిఫికేషన్స్ (అంచనా)
Realme 10 సిరీస్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ప్యానెల్స్ కలిగి ఉండనున్నాయి. Realme 10 సిరీస్ మోడల్ ని బట్టి, మీడియాటెక్ హీలియో జీ92 చిప్సెట్ లేదా డైమెన్సిటీ 1080 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Realme 10 సిరీస్ లో ఓఐఎస్ తో కూడిన 50 మెగా పిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది. Realme 10 సిరీస్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ ప్రస్తుతానికి రహస్యంగానే ఉన్నాయి. చిప్సెట్స్ ని బట్టి చూస్తే, రియల్మీ 10 సిరీస్ ధరలు తక్కువ బడ్జెట్ లోనే ఉంటాయని అర్థమవుతోంది. అయితే లీక్స్ ద్వారా మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.













