Home News లాంచ్ కి ముందు లీకైన Realme 10 సిరీస్ కలర్ ఆప్షన్స్, స్టోరేజీ వివరాలు

లాంచ్ కి ముందు లీకైన Realme 10 సిరీస్ కలర్ ఆప్షన్స్, స్టోరేజీ వివరాలు

హైలైట్స్

ఈ ఏడాది ఆరంభంలో, రియల్మీ సీఈవో మాధవ్ సేఠ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, 2022 చివరి కల్లా Realme 10 సిరీస్ ని భారత్ లో లాంచ్ చేస్తామని తెలిపారు. ఆయన స్టేట్మెంట్ తర్వాత వరుసగా పలు లీక్స్ నెట్టింట్లో హడావుడి చేశాయి. ఇంకా చేస్తూనే ఉన్నాయి. రీసెంట్ గా Realme 10 సిరీస్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్ సైట్ పై కనిపించింది. తాజాగా ప్రముఖ టిప్ స్టర్ సుదాన్శు అంబోరే Realme 10 సిరీస్ యొక్క ర్యామ్, స్టోరేజీ వివరాలను లీక్ చేశాడు. అలాగే కలర్ ఆప్షన్స్ ని కూడా బహిర్గతం చేశాడు.

Realme 10 సిరీస్ నుంచి ఏం ఆశించవచ్చు?

లీకైన సమాచారాన్ని బట్టి, Realme 10 సిరీస్ రియల్మీ స్టాండర్డ్ వర్షన్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మరియు 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది. ఇక హైఎండ్ ఫోన్ Realme 10 Pro+ 5G 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్లలో లభ్యమవుతుంది.

కలర్స్ విషయానికి వస్తే, Realme 10 రష్ బ్లాక్, క్లాష్ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. మరోవైపు Realme 10 Pro+ 5G నెబులా బ్లూ, డార్క్ మ్యాటర్, హైపర్ స్పేస్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.

Realme 10 ఒక 4జి స్మార్ట్ ఫోన్. ఎంట్రీ లెవెల్ 5జీ స్మార్ట్ ఫోన్ తో పోల్చితే ఈ ఫోన్ విభిన్నంగా ఉండనుంది. Realme 10 మీడియాటెక్ హీలియో జీ99 4జీ చిప్ తో వస్తోంది. ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ని కలిగి ఉంటుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ లో ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Realme 10 Pro+ 5G స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ తో వస్తోంది. దీంతో పాటు ఫాస్ట్ రిఫ్రెష్ రేట్ కలిగిన అమోలెడ్ డిస్ప్లే ని ఈ ఫోన్ కలిగి ఉండనుంది. అలాగే హై-రెజుల్యూషన్ కెమెరా సెన్సర్ ని ఇందులో వాడనున్నట్లు సమాచారం. ఆప్టికల్ ఇమేజ్ స్టబిలైజేషన్ ఫీచర్ కూడా ఈ కెమెరాలో ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ ప్రో వర్షన్ 60 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోంది.

రూ.10,000 ఆపై ధరతో 5జీ ఫోన్లనే తీసుకు రావాలని భారత ప్రభుత్వం ఇటీవలె మొబైల్ ఫోన్ సంస్థలకు సూచించింది. సదరు సంస్థలు కూడా అదే పని చేస్తామని మాటిచ్చాయి. మరి ఇలాంటి తరుణంలో రియల్మీ 10 స్టాండర్డ్ వేరియంట్ ధర రూ.10,000 లోపు ధరతో వస్తుందా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే ఇదొక 4జీ ఫోన్. దీని ధర కచ్చితంగా రూ.10,000 లోపు ఉండాల్సిందే. ఇప్పుడు మొబైల్ ఫోన్ యూజర్లు 5జీ ఫోన్లను కొనేందుకే ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి తరుణంలో 4జీ ఫోన్లను ఇకపై తీసుకు రాకపోవడమే మంచిది. కానీ, ఇంకా కొన్ని సంస్థలు వరుసబెట్టి 4జీ ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. ఇలా అయితే భారతదేశంలో 5జీ యూజర్లు పెరగడం కష్టమే.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.