Home News Dimensity 810 చిప్, 5000mAh బ్యాటరీతో లాంచైన Realme 10S 5G

Dimensity 810 చిప్, 5000mAh బ్యాటరీతో లాంచైన Realme 10S 5G

హైలైట్స్

Realme 10S 5G స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయ్యింది. త్వరలో ఈ డివైజ్ భారత్ తో పాటు ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి స్పెసిఫికేషన్స్ ని ఈ ఫోన్ కలిగి ఉంది. Realme 10S 5G యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఇతర వివరాలు తెలుసుకుందాం పదండి.

Realme 10S 5G ధర

Realme 10S 5G చైనాలో రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది. అవి: 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ. 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర CNY 1099 (సుమారు రూ.13,100) కాగా, 256జిబి స్టోరేజీ మోడల్ ధర CNY 1299 (సుమారు రూ.15,400) గా ఉంది. ఈ ఫోన్ స్ట్రీమర్ బ్లూ మరియు క్లిస్టల్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.

Realme 10S 5G స్పెసిఫికేషన్స్

Realme 10S 5G స్మార్ట్ ఫోన్ లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 1080*2408 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 20.5:9 యాస్పెక్ట్ రేషియో, 400 నిట్స్ బ్రైట్నెస్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ ఉంటాయి.

Realme 10S 5G స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్సెట్ అమర్చారు. ఈ డివైజ్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. రిటైల్ బాక్స్ లో చార్జర్ ఉంటుంది. ఇకపోతే ఈ డివైజ్ LPDDR4x ర్యామ్, UFS 2.2 స్టోరేజీతో వచ్చింది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకోవచ్చు.

ఇప్పుడు Realme 10S 5G యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ డివైజ్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

Realme 10S 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 3.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 5జీ, 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ-సీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. Realme 10S 5G డివైజ్ 164.4 మిల్లీ మీటర్ల పొడవు, 75.1 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.1 మిల్లీ మీటర్ల మందం, 191 గ్రాముల బరువు ఉంటుంది. త్వరలో భారత లాంచ్ తేదీని రియల్మీ ప్రకటించే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.