ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ త్వరలో భారతీయ మార్కెట్ లో Realme 11x 5G, Realme 11 5G డివైజెస్ ని లాంచ్ చేయనుంది. ఈ కంపెనీ తాజాగా వీటి లాంచ్ తేదీని ప్రకటించింది. ఆగస్టు 23 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు Realme 11x 5G, Realme 11 5G ఫోన్లు భారత్ లో లాంచ్ అవుతున్నాయి. లాంచ్ ఈవెంట్ లో ఈ ఫోన్లతో పాటు Realme Buds Air 5 Pro కూడా లాంచ్ అవుతున్నాయి.
Realme 11x 5G స్పెసిఫికేషన్స్ ని టీజ్ చేసిన కంపెనీ
ఈ నెల ఆరంభంలో తైవాన్ లో Realme 11 5G లాంచ్ కావడంతో ఆ ఫోన్ స్పెసిఫికేషన్స్ తెలిసాయి. కానీ, మొదటిసారిగా Realme 11x 5G డివైజ్ స్పెసిఫికేషన్స్ పై రియల్మీ కొంత సమాచారాన్ని బయటకు వదిలింది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.
Unleash the power of double innovation with the #realme11Series5G.
Our brand ambassador is all set to take the leap into the future. #DoubleAceDoubleLeap #realme5thAnniversary
Know more: https://t.co/Isu9Lf2ReQ pic.twitter.com/UaZuKUujPK
— realme (@realmeIndia) August 16, 2023
- లాంచ్ ఇన్వైట్ ప్రకారం, Realme 11x 5G డివైజ్ 64ఎంపి ప్రైమరీ ఏఐ కెమెరాతో వస్తోంది.
- Realme 11x 5G డివైజ్ 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- మరోవైపు Realme 11 5G ఫోన్ 108ఎంపి మెయిన్ రియర్ కెమెరా, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. Realme 11 సిరీస్ లో Realme 11x 5G డివైజ్ బేస్ మోడల్ అని తెలుస్తోంది.
Realme 11 5G, Realme 11x 5G స్మార్ట్ ఫోన్ల డిజైన్స్ ని ఇదివరకే కంపెనీ టీజ్ చేసింది. అలాగే తన అధికార వెబ్ సైట్ లో వీటి మైక్రోసైట్ కూడా కనిపిస్తోంది. ఇప్పటికే భారతీయ మార్కెట్ లో అందుబాటులో ఉన్న Realme 11 Pro, Realme 11 Pro+ సరసన Realme 11x 5G, Realme 11 5G ఫోన్లు చేరనున్నాయి.
Realme 11 5G స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: Realme 11 5G లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటాయి.
- ప్రాసెసర్: Realme 11 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ వాడారు.
- ర్యామ్, స్టోరేజీ: Realme 11 5G లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ అందిస్తున్నారు.
- కెమెరా: Realme 11 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందిస్తున్నారు.
- బ్యాటరీ: Realme 11 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందిస్తున్నారు. ఇది 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- సాఫ్ట్వేర్: Realme 11 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కనెక్టివిటీ: Realme 11 5G లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.
