
ప్రముఖ టెక్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో Realme 11 5G ని లాంచ్ చేసింది. Realme 11 5G స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, 6.72-ఇంచ్ భారీ డిస్ప్లే, 8జిబి ర్యామ్ తో వచ్చింది. ఇంకా Realme 11 లైనప్ లో Realme 11 5G తో పాటు, Realme 11x 5G కూడా లాంచ్ అయ్యింది. సరే, ఈ ఆర్టికల్ లో మనం Realme 11 5G యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.
Realme 11 5G స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: Realme 11 5G స్మార్ట్ ఫోన్ లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, పంచ్ హోల్ కటౌట్ డిజైన్ ఉంటాయి.
- ప్రాసెసర్: Realme 11 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్ ఉంటుంది. ఇది 6 నానోమీటర్ ప్రాసెసర్ పై తయారైన ఆక్టా-కోర్ చిప్. ఈ చిప్సెట్ 2.2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని కలిగి ఉంటుంది. ఇందులో ఏఆర్ఎమ్ జీ57 జీపీయూ గ్రాఫిక్స్ అందించారు.
- స్టోరేజీ: Realme 11 5G స్మార్ట్ ఫోన్ లో 8జిబి డైనమిక్ ర్యామ్, 8జిబి ఫిజికల్ ర్యామ్ ఉంటాయి. ర్యామ్ ని 16జిబి వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్ లో 256జిబి స్టోరేజీని అందిస్తున్నారు.
- కెమెరా: Realme 11 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్ఎమ్6 ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. ఈ డివైజ్ లో 3ఎక్స్ జూమ్ ఇచ్చారు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: Realme 11 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Realme 11 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
Realme 11 5G ధర, లభ్యత
- రెండు స్టోరేజీ వేరియంట్స్ లో Realme 11 5G లాంచ్ అయ్యింది.
- 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను కంపెనీ రూ.18,999 గా నిర్ణయించింది.
- 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.19,999 గా ఉంది.
- Realme 11 5G స్మార్ట్ ఫోన్ గ్లోరీ బ్లాక్ మరియు గ్లోరీ గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.











