
ప్రముఖ టెక్ బ్రాండ్ Realme గత రెండు వారాలుగా పలు డివైజెస్ ని లాంచ్ చేస్తూ పోతోంది. తాజాగా ఈ సంస్థ భారతదేశంలో మరొక స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేయడానికి సన్నద్ధమవుతోంది. Realme 11 సిరీస్ నుండి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయబోతున్నట్లు రియల్మీ సంస్థ టీజ్ చేసింది. గత నెలలో భారతదేశంలో విడుదల చేసిన Realme 11 మరియు Realme 11x 5G మరియు జూన్‌లో ఎంట్రీ ఇచ్చిన Realme 11 Pro మరియు 11 Pro+ తర్వాత నంబర్ సిరీస్‌లో ఇది ఐదవ ఫోన్.
Realme 11 5G స్మార్ట్‌ఫోన్‌ని టీజ్ చేసిన కంపెనీ
Unlock the Next Level of Innovation with the #realme11Series5G! ?
Elevate your user experience through exceptional design and breakthrough products.
Join the 5G revolution and redefine possibilities! ?#DoubleAceDoubleLeap pic.twitter.com/s8jFYxoUgw
— realme (@realmeIndia) September 9, 2023
సోషల్ మీడియా వేదిక X ద్వారా షేర్ చేసిన టీజర్లో, 11 సిరీస్ నుండి కొత్త ఫోన్ రాబోతోందని చెప్పడం మినహా రియల్మీ సంస్థ మరే ఇతర వివరాలను వెల్లడించలేదు. టీజర్‌ను బట్టి చూస్తే, రాబోయే లాంచ్ నుండి మనం ఒకటి కంటే ఎక్కువ ఫోన్లను ఊహించవచ్చు. Realme 11 5G మరియు Realme 11x 5G రెండూ రూ. 20,000 కంటే తక్కువ ధరలో ఉన్నందున, కొత్తగా రాబోవు ఫోన్ మధ్య-శ్రేణి విభాగంలో ఉంటుందని భావిస్తున్నారు.
రాబోయే స్మార్ట్‌ఫోన్ పేరును రియల్మీ ఇంకా వెల్లడించలేదు, అయితే కంపెనీ లాంచ్ ని టీజ్ చేసినందున త్వరలోనే డివైజ్ కి సంబంధించిన విషయాలు బయటకు రానున్నాయి. రాబోయే రియల్మీ ఫోన్‌పై ఊహాగానాల విషయానికొస్తే, ఇది భారతదేశంలో అందుబాటులో ఉన్న రియల్మీ 11 5G ఫోనేనని అయితే వేరే బ్రాండ్ పేరుతో లాంచ్ అవుతుందని MySmartPrice నివేదిక సూచించింది. ఏది నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Realme 11 5G స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: Realme 11 5G స్మార్ట్ ఫోన్ లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, పంచ్ హోల్ కటౌట్ డిజైన్ ఉంటాయి.
- ప్రాసెసర్: Realme 11 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్ ఉంటుంది. ఇది 6 నానోమీటర్ ప్రాసెసర్ పై తయారైన ఆక్టా-కోర్ చిప్. ఈ చిప్సెట్ 2.2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని కలిగి ఉంటుంది. ఇందులో ఏఆర్ఎమ్ జీ57 జీపీయూ గ్రాఫిక్స్ అందించారు.
- స్టోరేజీ: Realme 11 5G స్మార్ట్ ఫోన్ లో 8జిబి డైనమిక్ ర్యామ్, 8జిబి ఫిజికల్ ర్యామ్ ఉంటాయి. ర్యామ్ ని 16జిబి వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్ లో 256జిబి స్టోరేజీని అందిస్తున్నారు.
- కెమెరా: Realme 11 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్ఎమ్6 ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. ఈ డివైజ్ లో 3ఎక్స్ జూమ్ ఇచ్చారు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: Realme 11 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Realme 11 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.











