ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ త్వరలో భారతీయ మార్కెట్ లో Realme 11 5G డివైజ్ ని లాంచ్ చేయబోతోంది. దీంతో రియల్మీ ఫ్యాన్స్ ఈ ఫోన్ లాంచ్ కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా అభిషేక్ యాదవ్ ఈ ఫోన్ లాంచ్ టైమ్‌లైన్ గురించి సమాచారాన్ని లీక్ చేశారు. అతని ట్వీట్ ప్రకారం, Realme 11 5G డివైజ్ ఆగస్టు 12 న లాంచ్ అవుతుందని తెలుస్తోంది. తైవాన్ లో Realme 11 5G లాంచ్ అయినందున మనకు డివైజ్ స్పెసిఫికేషన్స్ తెలిసాయి.
సరే, ఈ ఆర్టికల్ లో మనం Realme 11 5G నుంచి ఏం ఆశించవచ్చు, ఇంకా టాప్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం.
Realme 11 5G స్పెసిఫికేషన్స్
- 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే: Realme 11 5G స్మార్ట్ ఫోన్ లో ఉన్న భారీ స్క్రీన్ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్ తో తయారైంది. ఇది 680 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ని కలిగి ఉంటుంది. ఇంకా 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది.
- మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్: Realme 11 5G డివైజ్ లో 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైన చిప్సెట్ వాడారు. ఇది 2.2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ గల 2ఎక్స్ ఏఆర్ఎమ్ కార్టెక్స్-ఏ76 కోర్స్ కలిగి ఉంది. అలాగే 2.0 గిగాహెర్ట్జ్ మ్యాక్స్ స్పీడ్ గల 6ఎక్స్ ఏఆర్ఎమ్ కార్టెక్స్-ఏ55 కోర్స్ కలిగి ఉంది.
- 100 మిలియన్ సింగిల్-లెన్స్ లాస్‌లెస్ జూమ్ కెమెరా: Realme 11 5G డివైజ్ లో 100 మిలియన్ సింగిల్-లెన్స్ లాస్‌లెస్ జూమ్ కెమెరా ఉంది. దీని వల్లన 108ఎంపి శాంసంగ్ హెచ్ఎమ్6 ప్రైమరీ కెమెరా ఎంతో మెరుగా పని చేయనుంది. దీంతో పాటు, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- SuperVOOC ఫాస్ట్ చార్జింగ్: Realme 11 5G స్మార్ట్ ఫోన్ పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్: Realme 11 5G స్మార్ట్ ఫోన్ లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అందిస్తున్నారు.
- ర్యామ్, స్టోరేజీ: Realme 11 5G డివైజ్ లో 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీని అందిస్తున్నారు.
- లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఓఎస్: Realme 11 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- బ్లూటూత్ 5.2: Realme 11 5G లో బ్లూటూత్ 5.2 వర్షన్ ని అందిస్తున్నారు. దీని వల్లన కనెక్టివిటీ వేగంగా ఉంటుంది. ఇంకా వై-ఫై 5 ని ఈ ఫోన్ లో అందించనున్నారు.
