
రియల్మీ సంస్థ రీసెంట్ గా ఓ కొత్త స్మార్ట్ ఫోన్ టీజర్ ని సోషల్ మీడియా ద్వారా రివీల్ చేసింది. అంతకు ముందు కంపెనీ బడ్స్ ఎయిర్ 5 ప్రో ని టీజ్ చేసింది. అయితే స్మార్ట్ ఫోన్ తో పాటు, టీడబ్ల్యూఎస్ లాంచ్ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించాల్సి ఉంది. రియల్మీ తాజాగా తన కొత్త టీజర్ వీడియోలో అప్‌కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి హింట్ ఇచ్చింది. దీంతో కంపెనీ రియల్మీ 11 రానున్నట్లు అర్థమవుతోంది.
రియల్మీ షేర్ చేసిన వీడియో ద్వారా రియర్ కెమెరా డిజైన్ రివీల్ అయ్యింది. సరే, ఇతర వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Realme 11 సిరీస్ కలర్ ఆప్షన్స్
Realme 11 సిరీస్ గోల్డ్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. కంపెనీ ఇంకా లైనప్ లో ఎన్ని డివైజెస్ లాంచ్ కానున్నాయో తెలపాల్సి ఉంది. Realme 11 స్మార్ట్ ఫోన్ లో 108ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుందని సమాచారం. పిల్-షేప్డ్ ఎల్ఈడీ ఫ్లాష్ మాడ్యూల్ ఉన్నట్లు ఇమేజెస్ ద్వారా తెలుస్తోంది.
Realme 11 5G స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)
- స్క్రీన్: Realme 11 5G లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 680 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- ప్రాసెసర్: Realme 11 5G స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్, మాలి-జీ57 ఎమ్సీ2 జీపీయూ ఉన్నాయి.
- స్టోరేజీ: Realme 11 5G డివైజ్ లో 8జిబి వరకు ర్యామ్ + 256జిబి వరకు స్టోరేజీ ఉన్నాయి. ఇంకా 8జిబి వర్చువల్ ర్యామ్ ని కూడా ఆఫర్ చేశారు.
- కెమెరా: Realme 11 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ ఏఐ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
- బ్యాటరీ: Realme 11 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Realme 11 5G లో బ్లూటూత్ 5.2, వై-ఫై 5, డ్యూయల్ సిమ్ 5జీ, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
- ఓఎస్: Realme 11 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది











