Home News Realme 11 Pro+ 5G బ్యాటరీ, చార్జింగ్ కెపాసిటీ వివరాలు; మే 10 న లాంచ్!

Realme 11 Pro+ 5G బ్యాటరీ, చార్జింగ్ కెపాసిటీ వివరాలు; మే 10 న లాంచ్!

Highlights
  • Realme 11 Pro+ 5G డివైజ్ బరువు 183 గ్రాములు
  • కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తోన్న మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్
  • ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోన్న డివైజ్

చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ త్వరలో Realme 11 Pro+ 5G డివైజ్ ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. తొలుత ఈ ఫోన్ చైనా మార్కెట్ లో లాంచ్ కానుంది. తర్వాత ఇతర గ్లోబల్ మార్కెట్స్ లోకి డివైజ్ ఎంట్రీ ఇవ్వనుంది. మే 10 న చైనాలో Realme 11 Pro+ 5G లాంచ్ కానుంది. అయితే అఫీషియల్ లాంచ్ కి ముందు రియల్మీ సంస్థ ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ మరియు ఫీచర్లను టీజ్ చేస్తోంది. తాజాగా ఈ డివైజ్ కి సంబంధించిన బ్యాటరీ మరియు ఫాస్ట్ చార్జింగ్ వివరాలను కంపెనీ ఖరారు చేసింది.

ప్రస్తుతం మార్కెట్ లో కొనసాగుతోన్న మోడల్ కంటే Realme 11 Pro+ 5G డివైజ్ కాస్త బరువు ఉండనుందని సమాచారం. సరే, ఓసారి Realme 11 Pro+ 5G డివైజ్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ మరియు ఇతర వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Realme 11 Pro+ 5G బ్యాటరీ, చార్జింగ్ స్పెసిఫికేషన్స్

Realme 11 Pro+ 5G స్మార్ట్ ఫోన్ మే 10 వ తేదీన చైనాలో లాంచ్ కానుంది. లాంచ్ కి ముందు కంపెనీ ఈ ఫోన్ యొక్క బ్యాటరీ స్పెసిఫికేషన్స్ ఖరారు చేసింది. రియల్మీ సంస్థ Realme 11 Pro+ 5G డివైజ్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానున్నట్లు తెలిపింది. బ్యాటరీ కెపాసిటీని చూస్తే గత మోడల్ 10 Pro+ 5G మాదిరిగానే ఉంది.

Realme 11 Pro+ 5G స్మార్ట్ ఫోన్ అప్‌గ్రేడెడ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. ఈ ఫోన్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు రియల్మీ వెల్లడించింది. ఇక గత మోడల్ ని చూస్తే, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చింది. ఈ విషయంలో Realme 11 Pro+ 5G మంచి అప్‌గ్రేడ్ ని పొందిందనే చెప్పాలి.

Realme 11 Pro+ 5G బరువు

Realme 11 Pro+ 5G డివైజ్ బరువు వివరాలు కూడా తెలిసాయి. ఈ స్మార్ట్ ఫోన్ 183 గ్రాముల బరువు ఉంటుంది.

కెమెరా విభాగం

Realme 11 Pro+ 5G స్మార్ట్ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ స్మార్ట్ ఫోన్ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్, 3 సెన్సర్స్, ఎల్ఈడీ ఫ్లాష్ తో వస్తోంది. Realme 11 Pro+ 5G లో 200ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వచ్చే అవకాశం ఉంది. శాంసంగ్ ఐసోసెల్ హెచ్ఎమ్3 సెన్సర్ తో ఈ డివైజ్ రానున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది.

ఇతర సెన్సర్స్ విషయానికి వస్తే, 8ఎంపి అల్ట్రావైడ్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్స్ ఉండే అవకాశం ఉంది. అలాగే 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్ లో ఉంటుందని సమాచారం.

డిస్ప్లే

Realme 11 Pro+ 5G స్మార్ట్‌ఫోన్ లో కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హోల్-పంచ్ కటౌట్, 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండనున్నాయి.

చిప్సెట్, ర్యామ్

Realme 11 Pro+ 5G స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 తో రానుందని సమాచారం. ఈ చిప్సెట్ డైమెన్సిటీ 1080 చిప్ కి రీబ్యాడ్జ్డ్ వర్షన్ అని తెలుస్తోంది. ఇకపోతే 12జిబి/256జిబి వరకు ర్యామ్ మరియు స్టోరేజీ ఆప్షన్స్ తో ఈ డివైజ్ రానుంది.

ఓఎస్

Realme 11 Pro+ 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేయనుంది. ఈ డివైజ్ లో రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ ఉంటుంది.