ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ త్వరలోనే తన ప్రీమియమ్ స్నార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. మే 10 న చైనాలో ఈ సంస్థ Realme 11 Pro+ 5G డివైజ్ ని లాంచ్ చేయబోతోంది. ఈలోపు కంపెనీ ఫోన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ని టీజ్ చేస్తోంది. కొత్త డిజైన్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో ఈ ఫోన్ వస్తోంది. ఈ రియల్మీ ఫోన్ 120 హెర్ట్జ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, హోల్-పంచ్ కటౌట్ తో వస్తోంది.
రీసెంట్ గా ఈ ఫోన్ గీక్ బెంచ్ డేటాబేస్ పై కనిపించింది. ఇందులో Realme 11 Pro+ 5G యొక్క చిప్సెట్ మరియు ఇతర స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. మైస్మార్ట్‌ప్రైస్ తొలుత ఈ లిస్టింగ్ ని గుర్తించింది.
గీక్ బెంచ్ పై కనిపించిన Realme 11 Pro+ 5G
Realme 11 Pro+ 5G స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ చిప్సెట్ వాడారు. ఈ చిప్సెట్ MT6877V/TTZA అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. డైమెన్సిటీ 7050 చిప్సెట్, డైమెన్సిటీ 1080 కి రీబ్రాండ్ వర్షన్ అని తెలుస్తోంది.
గీక్ బెంచ్ సింగిల్ కోర్ టెస్ట్ లో Realme 11 Pro+ 5G డివైజ్ 838 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2302 పాయింట్లు సాధించింది.
Realme 11 Pro+ 5G స్పెసిఫికేషన్స్ (రూమర్లు)
డిస్ప్లే
Realme 11 Pro+ 5G లో 6.7-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీపీడబ్ల్యూ ఉన్నాయి.
చిప్సెట్
Realme 11 Pro+ 5G స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ వాడినట్లు సమాచారం.
ర్యామ్, స్టోరేజీ
Realme 11 Pro+ 5G లో 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ ఉండే అవకాశం ఉంది.
ఓఎస్
Realme 11 Pro+ 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
కెమెరా
Realme 11 Pro+ 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 200ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
బ్యాటరీ, చార్జింగ్
Realme 11 Pro+ 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ని కలిగి ఉంటుంది.
కలర్ ఆప్షన్స్
Realme 11 Pro+ 5G డివైజ్ సన్‌రైజ్ సిటీ కలర్ ఆప్షన్ లో లభిస్తుంది. ఈ ఫోన్ బీజ్ వీగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్, సెంటర్ లో గోల్డ్ మరియు సిల్వర్ స్టిచింగ్ తో వస్తోంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.
