Home News 200ఎంపి కెమెరా, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో చైనాలో లాంచైన Realme 11 Pro+ 5G

200ఎంపి కెమెరా, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో చైనాలో లాంచైన Realme 11 Pro+ 5G

Highlights
  • చైనాలో లాంచైన Realme 11 సిరీస్
  • లైనప్ లో ఎంట్రీ ఇచ్చిన మూడు మోడల్స్
  • డైమెన్సిటీ 7050 చిప్, 200ఎంపి కెమెరాతో వచ్చిన Realme 11 Pro+ 5G

చైనాలో Realme 11 సిరీస్ అఫీషియల్ గా లాంచైంది. లైనప్ లో మూడు మోడల్స్ వచ్చాయి. అవి: Realme 11, Realme 11 Pro, Realme 11 Pro+ 5G. ఈ ఆర్టికల్ లో మనం Realme 11 Pro+ 5G గురించి తెలుసుకుందాం. ప్రీమియమ్ మిడ్-రేంజ్ కేటగిరీని టార్గెట్ చేస్తూ Realme 11 Pro+ 5G డివైజ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ లో 200ఎంపి ప్రైమరీ కెమెరా, కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ వాడారు.

సరే, ఓసారి Realme 11 Pro+ 5G స్మార్ట్ ఫోన్ ధర, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Realme 11 Pro+ 5G ధర

Realme 11 Pro+ 5G స్మార్ట్ ఫోన్ 12జిబి + 256జిబి వేరియంట్ ధర RMB 2,099 (సుమారు రూ.24,900) గా ఉంది. 12జిబి + 512జిబి మోడల్ ధర RMB 2,399 (సుమారు రూ.28,500) గా ఉంది. 12జిబి + 1టిబి వేరియంట్ ధర RMB 2799 (సుమారు రూ.33,200) గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ స్టారీ నైట్ డార్క్, సిటీ ఆఫ్ గ్రీన్స్, సిటీ ఆఫ్ సన్‌రైజ్ అనే 3 కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Realme 11 Pro+ 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

Realme 11 Pro+ 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1080*2412 పిక్సెల్స్ రెజుల్యూషన్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 93.65 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, 100 పర్సెంట్ డీసీఐ-పీ3 కలర్ గేముత్, పంచ్-హోల్ కటౌట్, స్లిమ్ బెజెల్స్, హెచ్డీఆర్10 ఉన్నాయి.

ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజీ

Realme 11 Pro+ 5G స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, మాలి-జీ68 జీపీయూ ఉన్నాయి. ఈ డివైజ్ లో 12జిబి ర్యామ్, 1టిబి స్టోరేజీ, మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ ఉన్నాయి.

ఓఎస్, బ్యాటరీ

Realme 11 Pro+ 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.

కెమెరా విభాగం

Realme 11 Pro+ 5G స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 200ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

కనెక్టివిటీ

Realme 11 Pro+ 5G స్మార్ట్ ఫోన్ లో 5జీ, 4జీ ఎల్టీఈ, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

సౌండ్

Realme 11 Pro+ 5G డివైజ్ లో డాల్బి అట్మాస్ సపోర్ట్, హై-రెజ్ ఆడియో, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్ ఉన్నాయి.