Home News ఖరారైన Realme 11 సిరీస్ లాంచ్ తేదీ; లీకైన 3 వేరియంట్స్ ఫాస్ట్ చార్జింగ్ వివరాలు!

ఖరారైన Realme 11 సిరీస్ లాంచ్ తేదీ; లీకైన 3 వేరియంట్స్ ఫాస్ట్ చార్జింగ్ వివరాలు!

Highlights
  • రివీలైన Realme 11 సిరీస్ లాంచ్ తేదీ
  • ఈ లైనప్ లో వస్తోన్న Realme 11, Realme 11 Pro, Pro+
  • లాంచ్ కి ముందు రివీలైన ఫాస్ట్ చార్జింగ్ స్పీడ్స్

రియల్మీ 11 సిరీస్ స్మార్ట్ ఫోన్ల లాంచ్ తేదీని రియల్మీ సంస్థ ఖరారు చేసింది. ఎన్ని డివైజెస్ ఈ లైనప్ లో లాంచ్ కానున్నాయో రియల్మీ వెల్లడించలేదు. కానీ, గత రిపోర్ట్స్ ని బట్టి, ఈ సిరీస్ లో 3 మోడల్స్ ఉంటాయని తెలుస్తోంది. అవి: Realme 11, Realme 11 Pro, Realme 11 Pro+. 2023 మే 10 వ తేదీన Realme 11 సిరీస్ లాంచ్ అవుతోందని రియల్మీ సంస్థ ప్రకటించింది.

ఈ మూడు మోడల్స్ నేడు చైనాకు చెందిన 3సీ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించాయి. దీంతో ఫాస్ట్ చార్జింగ్ స్పీడ్స్ రివీల్ అయ్యాయి. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

మే 10 న లాంచ్ అవుతోన్న Realme 11 సిరీస్

Realme 11 సిరీస్ లాంచ్ తేదీని రియల్మీ సంస్థ చైనా సామాజిక మాధ్యమం వీబో ద్వారా ప్రకటించింది. మే 10 న ఈ సిరీస్ చైనాలో లాంచ్ అవుతోంది. ప్రథమంగా ఈ సిరీస్ ఫోకస్ ఫోటోగ్రఫీ పై ఉంటుందని రియల్మీ తెలిపింది. రానున్న రోజుల్లో రియల్మీ సంస్థ తన 11 సిరీస్ డివైజెస్ డిజైన్, స్పెసిఫికేషన్స్ ని టీజ్ చేసే అవకాశం ఉంది.

Realme 11 సిరీస్ చార్జింగ్ స్పీడ్స్

చైనాకు చెందిన 3సీ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై రియల్మీ 11, రియల్మీ 11 ప్రో, రియల్మీ 11 ప్రో+ డివైజెస్ కనిపించాయి. Realme 11 డివైజ్ RMX3751 మోడల్ నంబర్ తో కనిపించింది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుంది. Realme 11 Pro డివైజ్ RMX3770 అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. ఈ ఫోన్ 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోంది. Realme 11 Pro+ డివైజ్ RMX3740 అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. ఈ ఫోన్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

Realme 11 Pro+ స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: Realme 11 Pro+ స్మార్ట్ ఫోన్ లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: ఈ డివైజ్ లో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7000-సిరీస్ చిప్సెట్ ఉండే అవకాశం ఉంది.

ర్యామ్, స్టోరేజీ: Realme 11 Pro+ లో 12జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఉంటాయి.

ఓఎస్: Realme 11 సిరీస్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరాస్: Realme 11 Pro+ లో 200ఎంపి కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయని అంచనా. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి కెమెరా ఉండే అవకాశం ఉంది.

బ్యాటరీ: Realme 11 Pro+ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయని సమాచారం.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.