ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Realme నేడు భారత్ లో Realme 11 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Realme 11x 5G తో పాటు Realme 11 5G కూడా లాంచ్ అయ్యింది. Realme 11x 5G డివైజ్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చింది. సరే, ఓసారి Realme 11x 5G యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
భారత్ లో Realme 11x 5G ధర
Realme 11x 5G స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,999 గా ఉంది. మరోవైపు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.15,999 గా నిర్ణయించారు. ఆగస్టు 30 నుంచి Realme 11x 5G సేల్ మొదలవుతుంది. ఈ డివైజ్ పర్పుల్ డాన్ మరియు మిడ్నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ కొనుగోలుపై రూ.1,000 డిస్కౌంట్ కూడా లభించనుంది. ఇంకా సేల్ సందర్భంగా నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్స్ కూడా లభించనున్నాయి.
Realme 11x 5G స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: Realme 11x 5G లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్, 680 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Realme 11x 5G స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉంది. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. ఈ చిప్ 2.2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంది. గ్రాఫిక్స్ కోసం ఈ ఫోన్ లో ఏఆర్ఎమ్ జీ57 ఎంసీ2 జీపీయూ వాడారు.
- ఓఎస్: Realme 11x 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- స్టోరేజీ: Realme 11x 5G రెండు ర్యామ్ వేరియంట్స్ లో లభిస్తుంది. 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీని ఈ ఫోన్ ఆఫర్ చేస్తుంది. డైనమిక్ ర్యామ్ టెక్నాలజీ ద్వారా 16జిబి వరకు ర్యామ్ ని పెంచుకునే వీలుంది.
- రియర్ కెమెరా: Realme 11x 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ఏఐ ప్రైమరీ సెన్సర్, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి.
- ఫ్రంట్ కెమెరా: Realme 11x 5G లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి కెమెరా అందించారు.
- బ్యాటరీ: Realme 11x 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కనెక్టివిటీ: Realme 11x 5G డివైజ్ 9 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ వొల్టీ, 3.5ఎంఎం ఆడియో జాక్, బ్లూటూత్ 5.2, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
