Realme 11x 5G: లీకైన స్టోరేజీ, కలర్స్; త్వరలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం!

Highlights

  • 2023 మే నెలలో చైనాలో లాంచైన Realme 11 సిరీస్
  • రియల్మీ నుంచి రానున్న Realme 11x 5G
  • రెండు మెమొరీ వేరియంట్స్ లో వస్తోన్న డివైజ్

జూన్ నెలలో Realme 11 Pro సిరీస్ భారత్ లో లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో Realme 11 Pro 5G, Realme 11 Pro+ 5G మోడల్స్ మార్కెట్ లోకి వచ్చాయి. ఈ ఫోన్లు రూ.30,000 లోపు ధరలోనే వచ్చాయి. మరోవైపు భారత్ లో స్టాండర్డ్ వేరియంట్ Realme 11 5G కూడా లాంచ్ కానుందని సమాచారం. ఈ ఫోన్ డైమెన్సిటీ 6100+ చిప్ తో రానున్నట్లు తెలుస్తోంది.

Appuals నివేదిక ప్రకారం, రియల్మీ సంస్థ భారత్ లో Realme 11x 5G ని లాంచ్ చేయనుందని తెలుస్తోంది. స్టోరేజీ ఆప్షన్స్, కలర్ ఆప్షన్స్ వివరాలను కూడా తన రిపోర్ట్ లో సదరు వెబ్ సైట్ పేర్కొంది. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Realme 11x 5G స్టోరేజీ, కలర్ ఆప్షన్స్

Realme 11x 5G స్మార్ట్ ఫోన్ భారత్ లో త్వరలోనే లాంచ్ కానుందని సమాచారం. బేస్ వేరియంట్ 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో వస్తోంది. మరోవైపు టాప్ వేరియంట్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో రానుంది. ఈ స్మార్ట్ ఫోన్ పర్పుల్ డాన్ మరియు మిడ్నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.

Realme 11x 5G స్మార్ట్ ఫోన్ ఆగస్టు లోనే భారత్ లో లాంచ్ కానుందని సమాచారం. అయితే Realme 11x 5G డివైజ్ యొక్క కచ్చితమైన స్పెసిఫికేషన్స్ తెలియలేదు. తైవాన్ లో రీసెంట్ గా లాంచైన Realme 11 5G డివైజ్ మాదిరే Realme 11x 5G ఉండనుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Realme 11x 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Realme 11x 5G స్మార్ట్ ఫోన్ లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 680 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • చిప్సెట్: Realme 11x 5G స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్ ఉంటుంది. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైన చిప్.
  • ర్యామ్: Realme 11x 5G డివైజ్ లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉంటాయి.
  • కెమెరా: Realme 11x 5G స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Realme 11x 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
Previous articlePOCO M6 Pro 5G: 50mp కెమెరా, 5000mAh బ్యాటరీతో లాంచైన పోకో ఎమ్6 ప్రో 5జీ!
Next articleReliance AGM 2023: ఆగస్టు 28న జియో ఫోన్ 5జీ లాంచ్ అయ్యే అవకాశం!
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.