ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ Realme భారతీయ మార్కెట్ లో మార్చి 6న Realme 12+ 5G ని లాంచ్ చేయబోతోంది. అయితే ఈ ఫోన్ తో పాటు Realme 12 5G ని కూడా విడుదల చేయనున్నట్లు తాజాగా రియల్మీ ప్రకటించింది. Realme 12 5G డివైజ్ 108ఎంపి ప్రైమరీ కెమెరా, ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్ వంటి స్పెసిఫికేషన్స్ ఉంటాయని రియల్మీ వెల్లడించింది. Realme 12+ 5G డివైజ్ వైట్ కలర్ ఆప్షన్ లో వస్తోంది.
Realme 12 5G లాంచ్ తేదీ, ప్రీ-ఆర్డర్ వివరాలు
- Realme 12 5G లాంచ్ వివరాలు X ప్లాట్ఫామ్ మరియు కంపెనీ వెబ్సైట్ ద్వారా రివీల్ అయ్యాయి.
- Realme 12 5G తో పాటు Realme 12+ 5G డివైజ్ మార్చి 6న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతుందని కంపెనీ వదిలిన కొత్త టీజర్ ద్వారా తెలుస్తోంది.
- రెండు ఫోన్లు కూడా నేడు మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రీ-ఆర్డర్ కి అందుబాటులోకి వచ్చాయి.
- Realme 12 5G 108ఎంపి క్లియర్ పొట్రెయిట్ మాస్టర్ కెమెరా, 3ఎక్స్ జూమ్ ఫీచర్ తో వస్తోంది.
? Keep a check on perfect perspective and clear picture quality with the 108MP portrait camera of #realme12 5G.
Launching on 6th March, 12 Noon!
Know more: https://t.co/KV124zWuMV#realmePortraitMaster pic.twitter.com/OTm91k8aY0— realme (@realmeIndia) February 29, 2024
Realme 12 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: Realme 12 5G లో 6.72-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.
- ప్రాసెసర్: Realme 12 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ ఉంటుందని గీక్బెంచ్ ద్వారా రివీల్ అయ్యింది.
- ర్యామ్, స్టోరేజీ: Realme 12 5G డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్ లో లాంచ్ కానుంది.
- బ్యాటరీ: Realme 12 5G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ చార్జింగ్ వివరాలు ఇంకా తెలియదు.
- కెమెరా: Realme 12 5G డివైజ్ లో భారీ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంటుందని టీజర్ ద్వారా తెలుస్తోంది. ఈ ఫోన్ లో డ్యూయల్ లేదా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండే అవకాశం ఉంది.
- ఓఎస్: Realme 12 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది.
