
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో Realme 12 5G అనే డివైజ్‌ని లాంచ్ చేసింది. ఆపిల్ డివైజెస్ లో కనిపించే డైనమిక్ బటన్ మాదిరి ఫీచర్ Realme 12 5G లో ఉండటం విశేషం. ఇంకా ఈ ఫోన్ లో 108ఎంపి 3ఎక్స్ జూమ్ పొట్రెయిట్ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, 8జిబి ర్యామ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సరే, ఓసారి Realme 12 5G డివైజ్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర మరియు లభ్యత తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
Realme 12 5G ధర
Realme 12 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో భారత్ లో లాంచ్ అయ్యింది.
Realme 12 5G ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.16,999 గా ఉంది. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.17,999 గా నిర్ణయించారు.
లాంచ్ ఆఫర్ లో భాగంగా, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ మరియు ఎస్బీఐ బ్యాంక్ కార్డ్ లావాదేవీలపై రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది.
Realme 12 5G డివైజ్ మార్చి 10వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి సేల్ కి అందుబాటులో ఉంటుంది.
Realme 12 5G డివైజ్ ని ఫ్లిప్‌కార్ట్, రియల్మీ వెబ్సైట్ మరియు ఇతర రిటైల్ ఔట్లెట్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
కంపెనీ యొక్క కొత్త ఆఫర్ లో భాగంగా, రూ.2,998 విలువ గల రియల్మీ బడ్స్ వైర్లెస్ 3 ని యూజర్లు ఉచితంగా పొందవచ్చు.
Realme 12 5G డిజైన్
Realme 12 5G స్మార్ట్‌ఫోన్ లో బ్యాక్ ప్యానెల్ పై భారీ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంది.
ఇంకా డ్యూయల్ కెమెరా సెటప్ తో పాటు, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. ఫోన్ ముందువైపు ఫ్లాట్ ప్యానెల్ ఉంది.
Realme 12 5G డివైజ్ ట్విలైట్ పర్పుల్ మరియు ఉడ్‌ల్యాండ్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Realme 12 5G స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Realme 12 5G లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 950 నిట్స్ బ్రైట్నెస్, 91.40% స్క్రీన్ టు బాడీ రేషియో, 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Realme 12 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.
- కెమెరా: Realme 12 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
- ర్యామ్, స్టోరేజీ: Realme 12 5G డివైజ్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
- బ్యాటరీ: Realme 12 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వాడారు. ఇది 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Realme 12 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 2 ఏళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్స్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్ కి లభిస్తాయి.
- కనెక్టివిటీ: Realme 12 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.2 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.











