
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో భారతీయ మార్కెట్ లో Realme 12+ 5G డివైజ్‌ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ కొన్ని రోజుల క్రితం ఖరారు చేసింది. Realme 12+ 5G డివైజ్ భారత్ లో మార్చి 6న లాంచ్ అవుతోంది. ఇకపోతే, ఈ ఫోన్ యొక్క మైక్రోసైట్ ద్వారా డిస్ప్లే, ప్రాసెసర్ మరియు కెమెరా స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి Realme 12+ 5G యొక్క స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.
Realme 12+ 5G స్పెసిఫికేషన్స్ (ఖరారైనవి)
Realme 12+ 5G స్మార్ట్‌ఫోన్ లో అమోలెడ్ అల్ట్రా-స్మూథ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్ ఉంటాయి.
రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్ ద్వారా యూజర్లు తమ ఫోన్‌ని తడి చేతులతో కూడా ఆపరేట్ చేయవచ్చు.
Realme 12+ 5G డివైజ్ మైక్రోసైట్ పై పంచ్ హోల్ కటౌట్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, సిమ్ కార్డ్ ట్రే మరియు స్పీకర్ గ్రిల్ తో కనిపించింది.
Realme 12+ 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ ఉంటుందని తెలుస్తోంది. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.
Realme 12+ 5G లో సోని ఎల్‌వైటీ 600 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఈ సెగ్మెంట్ లో ఎల్‌వైటీ 600 సెన్సర్ కలిగిన మొదటి ఫోన్ Realme 12+ 5G అని కంపెనీ చెబుతోంది.
ఈ లెన్స్ 2ఎక్స్ ఇన్-సెన్సర్ జూమ్ మరియు సినిమా-గ్రేడ్ ఫోటోస్, పొట్రెయిట్ మోడ్ వంటి ఫీచర్లను ఆఫర్ చేస్తుంది. కెమెరా విభాగంపై కంపెనీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. తక్కువ బడ్జెట్ లో మంచి కెమెరా ఫోన్ కొనాలనుకునే వారికి ఈ ఫోన్ మంచి ఆప్షన్ అవ్వొచ్చు.
Realme 12+ 5G ధర (అంచనా)
Realme 12+ 5G డివైజ్ మార్చి 6న లాంచ్ కానుంది. అయితే, స్పెసిఫికేషన్స్‌ని బట్టి, ఫోన్ ధర రూ.20,000 వద్ద ఉంటుందని అంచనా వేయవచ్చు. త్వరలోనే ధరపై పూర్తి స్పష్టత వస్తుంది.
Realme 12+ 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: Realme 12+ 5G లో 6.67-ఇంచ్ ఫ్లాట్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉంటాయి.
- ప్రాసెసర్: Realme 12+ 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ ఉంటుంది.
- ర్యామ్, స్టోరేజీ: Realme 12+ 5G డివైజ్ 12జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- కెమెరా: Realme 12+ 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ600 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా మరియు ఇతర సెన్సర్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి సెల్ఫీ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: Realme 12+ 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Realme 12+ 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.












