Home News Realme 12+ 5G స్పెసిఫికేషన్స్ ఖరారు

Realme 12+ 5G స్పెసిఫికేషన్స్ ఖరారు

Highlights
  • మార్చి 6న Realme 12+ 5G లాంచ్
  • డైమెన్సిటీ 7050 చిప్‌తో వస్తోన్న ఫోన్
  • Sony LYT 600 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో భారతీయ మార్కెట్ లో Realme 12+ 5G డివైజ్‌ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ కొన్ని రోజుల క్రితం ఖరారు చేసింది. Realme 12+ 5G డివైజ్ భారత్ లో మార్చి 6న లాంచ్ అవుతోంది. ఇకపోతే, ఈ ఫోన్ యొక్క మైక్రోసైట్ ద్వారా డిస్ప్లే, ప్రాసెసర్ మరియు కెమెరా స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి Realme 12+ 5G యొక్క స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Realme 12+ 5G స్పెసిఫికేషన్స్ (ఖరారైనవి)

Realme 12+ 5G స్మార్ట్‌ఫోన్ లో అమోలెడ్ అల్ట్రా-స్మూథ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, రెయిన్ వాటర్ స్మార్ట్‌ టచ్ ఫీచర్ ఉంటాయి.

రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్ ద్వారా యూజర్లు తమ ఫోన్‌ని తడి చేతులతో కూడా ఆపరేట్ చేయవచ్చు.

Realme 12+ 5G డివైజ్ మైక్రోసైట్ పై పంచ్ హోల్ కటౌట్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, సిమ్ కార్డ్ ట్రే మరియు స్పీకర్ గ్రిల్ తో కనిపించింది.

Realme 12+ 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ ఉంటుందని తెలుస్తోంది. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.

Realme 12+ 5G లో సోని ఎల్‌వైటీ 600 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఈ సెగ్మెంట్ లో ఎల్‌వైటీ 600 సెన్సర్ కలిగిన మొదటి ఫోన్ Realme 12+ 5G అని కంపెనీ చెబుతోంది.

ఈ లెన్స్ 2ఎక్స్ ఇన్-సెన్సర్ జూమ్ మరియు సినిమా-గ్రేడ్ ఫోటోస్, పొట్రెయిట్ మోడ్ వంటి ఫీచర్లను ఆఫర్ చేస్తుంది. కెమెరా విభాగంపై కంపెనీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. తక్కువ బడ్జెట్ లో మంచి కెమెరా ఫోన్ కొనాలనుకునే వారికి ఈ ఫోన్ మంచి ఆప్షన్ అవ్వొచ్చు.

Realme 12+ 5G ధర (అంచనా)

Realme 12+ 5G డివైజ్ మార్చి 6న లాంచ్ కానుంది. అయితే, స్పెసిఫికేషన్స్‌ని బట్టి, ఫోన్ ధర రూ.20,000 వద్ద ఉంటుందని అంచనా వేయవచ్చు. త్వరలోనే ధరపై పూర్తి స్పష్టత వస్తుంది.

Realme 12+ 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)