Realme: 64MP పెరిస్కోప్ కెమెరాతో భారత్‌లో లాంచైన Realme 12 Pro+ 5G

Highlights

  • నేడు భారత్‌లో లాంచైన Realme 12 Pro+ 5G
  • ప్రోఎక్స్‌డీఆర్ అమోలెడ్ డిస్ప్లేతో వచ్చిన ఫోన్
  • Realme 12 Pro+ 5G ప్రారంభ ధర రూ.31,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారత్ లో Realme 12 Pro సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Realme 12 Pro 5G మరియు Realme 12 Pro+ 5G డివైజెస్ లాంచ్ అయ్యాయి. ఈ ఆర్టికల్ లో మనం Realme 12 Pro+ 5G డివైజ్ గురించి తెలుసుకుందాం. Realme 12 Pro+ 5G స్మార్ట్‌ఫోన్ 8జిబి/12జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ తో లాంచ్ అయ్యింది. ఇంకా ఈ ఫోన్ లో 6.7-ఇంచ్ డిస్ప్లే, 64ఎంపి పెరిస్కోప్ లెన్స్, 32ఎంపి ఫ్రంట్ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సరే, ఓసారి Realme 12 Pro+ 5G పూర్తి స్పెసిఫికేషన్స్, ధర, కలర్ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం పదండి.

Realme 12 Pro+ 5G ధర

  • Realme 12 Pro+ 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.29,999 గా నిర్ణయించారు.
  • Realme 12 Pro+ 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.31,999 గా పెట్టారు.
  • Realme 12 Pro+ 5G 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.33,999 గా ఉంది.

Realme 12 Pro+ 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Realme 12 Pro+ 5G లో 6.7-ఇంచ్ ప్రోఎక్స్‌డీఆర్ అమోలెడ్ స్క్రీన్, పుల్‌ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 950 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 100% పర్సెంట్ డీసీఐ-పీ3, 1.07 బిలియన్ కలర్స్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Realme 12 Pro+ 5G లో స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్, అడ్రెనో 710 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Realme 12 Pro+ 5G లో 12జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 12జిబి డైనమిక్ ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి.
  • సాఫ్ట్‌వేర్: Realme 12 Pro+ 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 2 మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్ కి లభిస్తాయి.
  • కెమెరా: Realme 12 Pro+ 5G లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ కెమెరా, 64ఎంపి ఒవి64బి పెరిస్కోప్ లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Realme 12 Pro+ 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Realme 12 Pro+ 5G లో 5జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ, జీపీఎస్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Realme 12 Pro+ 5G లో ఐపీ65, 3డీ వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉన్నాయి.
  • కలర్ ఆప్షన్స్: Realme 12 Pro+ 5G స్మార్ట్‌ఫోన్ సబ్‌మరైన్ బ్లూ, నేవిగేటర్ బీజ్, ఎక్స్‌ప్లోరర్ రెడ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.