
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో Realme 12 Pro సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Realme 12 Pro మరియు Realme 12 Pro+ 5G ఫోన్లు లాంచ్ కానున్నాయి. తాజాగా Realme 12 Pro+ 5G డివైజ్ యొక్క రిటైల్ బాక్స్ ఫోటో లీక్ అయ్యింది. పర్షియన్ వెబ్‌సైట్ ద్వారా ఈ ఫోటో బయటకు వచ్చింది. దీంతో Realme 12 Pro+ 5G కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలిసాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
Realme 12 Pro+ 5G రిటైల్ బాక్స్

- Realme 12 Pro+ 5G డివైజ్ యొక్క రిటైల్ బాక్స్ ఫోటో పర్షియన్ వెబ్‌సైట్ ద్వారా లీక్ అయ్యింది.
- Realme 12 Pro+ 5G రిటైల్ బాక్స్ బ్యాక్ సైడ్ మాత్రం కనిపిస్తోంది. ఫోటో ద్వారా స్పెసిఫికేషన్స్ ని మనం గమనించవచ్చు.
- Realme 12 Pro+ 5G డివైజ్ 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ రిటైల్ బాక్స్ అని అర్థమవుతోంది. నేవిగేటర్ బీజ్ కలర్ బాక్స్ పై పేర్కొనబడి ఉంది.
- Realme 12 Pro+ 5G డివైజ్ పెరిస్కోప్ పొట్రెయిట్ ఓఐఎస్ కెమెరా, సోని ఐఎంఎక్స్ ఐఎంఎక్స్890 సెన్సర్, 120 హెర్ట్జ్ కర్వ్డ్ విజన్ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్, 13 5జీ బ్యాండ్స్.. వంటి స్పెసిఫికేషన్స్ రిటైల్ బాక్స్ పై రాసి ఉన్నాయి.
Realme 12 Pro సిరీస్ లాంచ్ వివరాలు
- Realme 12 Pro సిరీస్ భారత్ లో జనవరి 29న లాంచ్ కానుంది. జనవరి 29న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ ఈవెంట్ ఉంటుందని కంపెనీ అధికార ప్రకటన చేసింది.
- Realme 12 Pro మరియు Realme 12 Pro+ 5G డివైజెస్ ఈ సిరీస్ లో లాంచ్ కానున్నాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ తో పాటు కంపెనీ వెబ్‌సైట్ ద్వారా ఈవెంట్ ని ప్రత్యక్షప్రసారం ద్వారా చూడవచ్చు.
Realme 12 Pro సిరీస్ స్పెసిఫికేషన్స్ (లీక్)
- డిస్ప్లే: Realme 12 Pro మరియు Realme 12 Pro+ 5G ఫోన్లలో కర్వ్డ్ ఎడ్జ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.
- కెమెరా: Realme 12 Pro సిరీస్ 200ఎంపి పెరిస్కోప్ కెమెరా, 120ఎక్స్ జూమ్, 3ఎక్స్ జూమ్ ఫీచర్స్ ఉంటాయి. Realme 12 Pro+ 5G లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- ప్రాసెసర్: Realme 12 Pro+ 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్ ఉంటుంది. ప్రో మోడల్ లో ఆక్టా-కోర్ చిప్సెట్ ఉంటుంది. దాని పేరు ఇంకా తెలియదు.
- ర్యామ్, స్టోరేజీ: రెండు ఫోన్లలోనూ 4 స్టోరేజీ ఆప్షన్స్ ఉంటాయి. ఈ డివైజెస్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి+256జిబి, 12జిబి+512జిబి మరియు 16జిబి+1టిబి వేరియంట్స్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
- బ్యాటరీ: Realme 12 Pro, Realme 12 Pro+ 5G ఫోన్లలో పవర్ బ్యాకప్ కోసం 4,880 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్లు 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చే అవకాశం ఉంది.











