ప్రముఖ టెక్ బ్రాండ్ Realme త్వరలోనే తన కొత్త ఫ్లాగ్షిప్ డివైజ్ ని లాంచ్ చేయబోతోంది. తాజాగా దీనికి సంబంధించి ఒక పిక్ రివీల్ అయ్యింది. అయితే ఆ పిక్ లో కనిపిస్తోన్న డివైజ్ Realme 12 Pro+ లేదా Realme GT 5 Pro ఫోన్లలో ఏదో ఒకటయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. రీసెంట్ గా రియల్మీ కూడా ఒక కొత్త ఫోన్ ని సోషల్ మీడియాలో టీజ్ చేసింది. దాని మాదిరే ఇప్పుడు లీకైన పిక్ ఉంది. సరే, ఓసారి లీకైన రెండర్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.
Realme 12 Pro+ రెండర్ (లీక్)
Realme 12 Pro+ render.
Via: 定焦数码 (Weibo) pic.twitter.com/AgB8zseh6Z— Abhishek Yadav (@yabhishekhd) September 27, 2023
- రియల్మీ నుంచి రాబోవు కొత్త ఫోన్ యొక్క రెండర్ మైక్రో బ్లాగింగ్ సైట్ వీబో పై ప్రత్యక్షమైంది.
- ఈ పిక్ లో ఉన్న ఫోన్ Realme GT 5 Pro అని కొందరు భావిస్తున్నారు. కానీ రీసెంట్ గా లాంచైన Realme GT 5 తో పోల్చితే డిజైన్ కాస్త వేరుగా ఉంది.
- అయితే భారత్ కి చెందిన టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్, ఈ ఫోన్ Realme 12 Pro+ అంటూ ఓ పోస్ట్ చేశారు.
- రెండర్ విషయానికి వస్తే, ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై భారీ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్, రెండు సర్క్యులర్ కెమెరాలు, ఒక రెక్టాంగ్యులర్ షేప్ లో ఉన్న లెన్స్ ఉన్నాయి. వీటితోపాటు మ్యాక్స్ కెన్ జూమ్ అని రాసి ఉంది.
- ఫోన్ బ్యాక్ ప్యానెల్ కి కింద రియల్మీ బ్రాండింగ్ ఉంది.
- డివైజ్ కి కుడివైపున పవర్ మరియు వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. ఓవరాల్ గా డివైజ్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తోంది.
- మరి ఈ ఫోన్ Realme 12 Pro+ లేదా Realme GT 5 Pro లలో ఏ పేరుతో పిలుస్తారో చూడాలి. త్వరలోనే రియల్మీ నుంచి దీనికి సంబంధించి క్లారిటీ వస్తుందని ఆశిద్దాం.
Realme 12 Pro+ కెమెరా స్పెసిఫికేషన్స్ (అంచనా)
- రియల్మీ కంపెనీ యొక్క గ్లోబల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ పై రీసెంట్ గా ఒక కొత్త ఫోన్ కి సంబంధించిన సమాచారం రివీల్ అయ్యింది.
- పోస్ట్ లో డివైజ్ యొక్క పేరుని పేర్కొనలేదు. దీంతో ఆ సమయంలో ఈ ఫోన్ ని Realme GT 5 Pro అని అనుకున్నారు. ఇప్పుడు Realme 12 Pro+ అని చెబుతున్నారు.
- మొబైల్ బ్యాక్ సైడ్ లో మ్యాక్స్ జూమ్ లెన్స్ గురించి పోస్ట్ లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అంటే, స్మార్ట్‌ఫోన్ లో పెరిస్కోప్ లెన్స్ అందిస్తున్నట్లు అర్థమవుతోంది.
- దీంతో పాటు లైట్ విల్ షైన్ ఆన్ రియల్మీ, జస్ట్ వెయిట్ అని రాసి ఉంది.
- ఈ రియల్మీ కొత్త ఫోన్ త్వరలోనే లాంచ్ కానుందని టీజర్ ద్వారా తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఈ డివైజ్ కి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
