Snapdragon 7s Gen 2 చిప్‌తో లాంచ్ కానున్న Realme 12 Pro+

Highlights

  • త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న Realme 12 Pro+
  • ఇంకా అధికారికంగా ప్రకటించని కంపెనీ
  • Snapdragon 7s Gen 2 చిప్‌తో వస్తోన్న డివైజ్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Realme ఇటీవలె తన రాబోవు ఫోన్ గురించి X ఖాతా ద్వారా హింట్ ఇచ్చింది. ‘నో పెరిస్కోప్ నో ఫ్లాగ్షిప్’ అని రియల్మీ తన పోస్ట్ కి క్యాప్షన్ ఇచ్చింది. ఇది Realme 12 Pro సిరీస్ గురించేనని అంతా భావించారు. అయితే కంపెనీ మాత్రం సిరీస్ పేరుని ఇంకా వెల్లడించలేదు. కానీ, 2024 ఫిబ్రవరిలో తన అప్‌కమింగ్ సిరీస్ ని రియల్మీ లాంచ్ చేయనుందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు 91mobiles కి Realme 12 Pro+ యొక్క చిప్సెట్ కి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ సమాచారం తెలిసింది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.

Realme 12 Pro+ చిప్సెట్ వివరాలు

  • Realme 12 Pro+ లో స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్ ఉంటుందని సమాచారం.
  • అయితే, చిప్సెట్ కి సంబంధించి కంపెనీ నుంచి అధికార ప్రకటన వెల్లడి కాలేదు.
  • కానీ, టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్.. Realme 12 Pro+ డివైజ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్ తో వస్తుందని తెలిపారు.
  • 2024 జనవరి నెల మూడో వారం లేదా చివరి వారంలో Realme తన కొత్త స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేసే అవకాశం ఉంది.
  • ఈ డివైజ్ భారతీయ మార్కెట్ లో మిడ్-బడ్జెట్ రేంజ్ లో లాంచ్ అవుతుందని సమాచారం.
  • రిపోర్ట్ ప్రకారం, ఈ ఫోన్ లో ఒమ్నివిజన్ ఒవి64బి పెరిస్కోప్ టెలీఫోటో 3x ఆప్టికల్ జూమ్ లెన్స్ ఉంటుందని తెలుస్తోంది.

Realme 12 Pro, Realme 12 Pro+ స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిజైన్: Realme 12 Pro మరియు Realme 12 Pro+ డివైజెస్ లో బ్యాక్ ప్యానెల్ పై సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంటుంది.
  • ప్రాసెసర్: Realme 12 Pro మరియు Realme 12 Pro+ స్మార్ట్‌ఫోన్లలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్, అడ్రెనో జీపీయూ ఉంటాయని టిప్‌స్టర్ ద్వారా తెలుస్తోంది. ఆక్టా-కోర్ 4ఎన్ఎమ్ ప్రాసెస్ పై ఈ చిప్ తయారైంది.
  • కెమెరా: Realme 12 Pro డివైజ్ లో 32ఎంపి సోని ఐఎంఎక్స్709 టెలీఫోటో 2x లెన్స్ ఉండే అవకాశం ఉంది. మరోవైపు, Realme 12 Pro+ లో 64ఎంపి పెరిస్కోప్ 3x ఆప్టికల్ జూమ్ కెమెరా ఉంటుంది. ఇది ఒమ్నివిజన్ ఒవి64బి సెన్సర్ సపోర్ట్ తో వస్తున్నట్లు సమాచారం.
  • ఓఎస్: Realme 12 Pro మరియు Realme 12 Pro+ డివైజెస్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.