ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో Realme 12 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Realme 12 Pro మరియు Realme 12 Pro Plus డివైజెస్ లాంచ్ కానున్నాయి. భారత్ లో ఈ డివైజెస్ ఎప్పుడు లాంచ్ అవుతాయో ఇంకా తెలియదు. త్వరలోనే కంపెనీ నుంచి లాంచ్ తేదీ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే, ఈ ఫోన్లు పలు సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ లో లిస్ట్ అయ్యాయి. తాజాగా Realme 12 Pro డివైజ్ యొక్క రెండర్స్ టిప్‌స్టర్ ద్వారా లీక్ అయ్యాయి. దీంతో డిజైన్, కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
Realme 12 Pro డిజైన్, కలర్ ఆప్షన్స్ (రెండర్స్)
- Realme 12 Pro డివైజ్ రెండర్స్‌ని టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ చైనీస్ మైక్రో బ్లాగింగ్ సైట్ వీబో ద్వారా రివీల్ చేశారు.
- రెండర్స్ లో Realme 12 Pro డివైజ్ బ్లాక్, ఆరెంజ్ మరియు క్రీమ్ కలర్స్ లో కనిపిస్తోంది.
- Realme 12 Pro బ్యాక్ ప్యానెల్ పై యెల్లో కలర్ స్ట్రిప్ సెంటర్ లో ఉంది. దాని పైన కెమెరా మాడ్యూల్ ఉంది. రెండు మోడల్స్ వీగన్ లెదర్ తో రానుండగా, మరొక మోడల్ గ్లాస్ బ్యాక్ తో వస్తోంది.
- Realme 12 Pro బ్యాక్ ప్యానెల్ పై ఉన్న కెమెరా మాడ్యూల్ లో ట్రిపుల్ లేదా క్వాడ్ కెమెరా సెటప్ ఉందనిపిస్తోంది. దీనికి తోడు ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది.
- Realme 12 Pro డివైజ్ లో ముందువైపు కర్వ్డ్ ఎడ్జ్ పంచ్ హోల్ డిస్ప్లే ఉంది. మొత్తం మీద ఈ ఫోన్ చాలా సన్నగా, చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది.
Realme 12 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)
- స్క్రీన్: Realme 12 Pro లో 6.7-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉంటాయి.
- ప్రాసెసర్: Realme 12 Pro లో ఆక్టాకోర్ చిప్సెట్ ఉంటుంది. అయితే ఈ ప్రాసెసర్ పేరుని ఇంకా రివీల్ చేయలేదు.
- ర్యామ్, స్టోరేజీ: Realme 12 Pro డివైజ్ 6జిబి/8జిబి/12జిబి/16జిబి ర్యామ్, 128జిబి/256జిబి/512జిబి/1టిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- బ్యాటరీ: Realme 12 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4,880 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. కెపాసిటీ ఇంకా తెలియదు.
- కెమెరా: Realme 12 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 32ఎంపి టెలీఫోటో లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- ఓఎస్: Realme 12 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది.
- కనెక్టివిటీ: Realme 12 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.
