
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో Realme 12 Pro సిరీస్ ని లాంచ్ చేయనుంది. తాజాగా లాంచ్ టైమ్‌లైన్ టీజర్ ని కంపెనీ విడుదల చేసింది. జనవరి నెలలోనే భారత్ లో Realme 12 Pro సిరీస్ లాంచ్ అవుతుందని X పై టీజర్ ద్వారా కంపెనీ తెలియజేసింది. లైనప్ లో Realme 12 Pro మరియు Realme 12 Pro Plus డివైజెస్ మార్కెట్ లోకి రానున్నాయి. సరే, ఓసారి Realme 12 Pro సిరీస్ లాంచ్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం.
Realme 12 Pro సిరీస్ ఇండియా లాంచ్ ఖరారు
The moment is here! ?
Revealing the master lens to revolutionize your visualization experience with the periscope camera. #PeriscopeOver200MPGuess the launch date and stand a chance to win #realme12ProSeries5G!?
Know more: https://t.co/jH9H8nqk55 pic.twitter.com/zkRYMLmMnF
— realme (@realmeIndia) January 10, 2024
- సామాజిక మాధ్యమం X పై రియల్మీ కొత్త టీజర్ ని విడుదల చేసింది. ఈ టీజర్ ద్వారా Realme 12 Pro సిరీస్ ఇండియా లాంచ్ ని కన్ఫర్మ్ చేసింది.
- Realme 12 Pro సిరీస్ భారతీయ మార్కెట్ లో జనవరి నెలలోనే లాంచ్ కానుందని టీజర్ ద్వారా తెలుస్తోంది. ఇంకా కచ్చితమైన తేదీని కంపెనీ వెల్లడించలేదు.
- Realme 12 Pro సిరీస్ లాంచ్ టైమ్‌లైన్ టీజర్ లో XXJanuary 2024 అని పేర్కొనబడి ఉంది. త్వరలోనే తేదీని కంపెనీ ప్రకటించనుంది.
- PeriscopeOver200MP అని టీజర్ పోస్ట్ కి హ్యాష్‌ట్యాగ్ ని కంపెనీ జత చేసింది.
- అయితే 200ఎంపి పెరిస్కోప్ కెమెరా Realme 12 Pro లో ఉంటుందా లేదా Realme 12 Pro Plus లో ఉంటుందా అనేది ఇంకా తెలియదు.
Realme 12 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)
- స్క్రీన్: Realme 12 Pro లో 6.7-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉంటాయి.
- ప్రాసెసర్: Realme 12 Pro లో ఆక్టాకోర్ చిప్సెట్ ఉంటుంది. అయితే ఈ ప్రాసెసర్ పేరుని ఇంకా రివీల్ చేయలేదు.
- ర్యామ్, స్టోరేజీ: Realme 12 Pro డివైజ్ 6జిబి/8జిబి/12జిబి/16జిబి ర్యామ్, 128జిబి/256జిబి/512జిబి/1టిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- బ్యాటరీ: Realme 12 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4,880 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. కెపాసిటీ ఇంకా తెలియదు.
- కెమెరా: Realme 12 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 32ఎంపి టెలీఫోటో లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- ఓఎస్: Realme 12 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది.
- కనెక్టివిటీ: Realme 12 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.
Realme 12 Pro Plus స్పెసిఫికేషన్స్ (అంచనా)
- కెమెరా: Realme 12 Pro Plus లో 64ఎంపి ఒమ్నివిజన్ ఒవి64బి పెరిస్కోప్ టెలీఫోటో 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ కెమెరా, 50ఎంపి సెకండరీ లెన్స్, 8ఎంపి థర్డ్ సెన్సర్ ఉంటాయి. ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- ప్రాసెసర్: Realme 12 Pro Plus లో స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్ ఉంటుంది.
- బ్యాటరీ: Realme 12 Pro Plus లో 4,880 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండే అవకాశం ఉంది.
- ర్యామ్, స్టోరేజీ: Realme 12 Pro Plus డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- ఓఎస్: Realme 12 Pro Plus డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.











