ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో Realme 13 5G సిరీస్ ను లాంచ్ చేయనుంది. తాజాగా ఈ సిరీస్ యొక్క ఇండియా లాంచ్ ఖరారైంది. రియల్మీ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఇండియా లాంచ్ ను కన్పర్మ్ చేసింది. ఇకపోతే, ఈ లైనప్ లో Realme 13 5G మరియు Realme 13+ 5G స్మార్ట్‌ఫోన్లు విడుదల కానున్నాయి. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Realme 13 5G ఇండియా లాంచ్ ఖరారు
Realme 13 5G సిరీస్ ఇండియా లాంచ్ ను రియల్మీ సంస్థ నేడు ఖరారు చేసింది. స్పీడ్ హ్యాజ్ ఏ న్యూ నంబర్ అనే ట్యాగ్‌లైన్ ను Realme 13 5G సిరీస్ కు రియల్మీ జత చేసింది. మరోవైపు, ఫ్లిప్‌కార్ట్ పై Realme 13 5G సిరీస్ యొక్క మైక్రోసైట్ కూడా దర్శనమిస్తోంది. అలాగే రియల్మీ వెబ్‌సైట్ పై కూడా ఈ సిరీస్ వివరాలను పొందుపరిచారు.
Realme 13 5G సిరీస్ టీజర్లను గమనిస్తే, రియల్మీ తన ఫోన్లను శక్తివంతమైన చిప్సెట్స్ తో తీసుకురానుందని అర్థమవుతోంది. ర్యామ్, చార్జింగ్ స్పీడ్ విషయాల్లో కూడా మార్పును గమనించవచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ కంటే శక్తివంతమైన చిప్సెట్ Realme 13 5G సిరీస్ లో ఉంటుందని రియల్మీ చెబుతోంది.
Get ready to level up your game!
Something powerful is coming your way. Guess what’s upcoming and stand a chance to win #realmeWatchS2
Stay tuned!
Know more: https://t.co/hHfPvfrQR7#UnmatchedSpeed pic.twitter.com/6PXQourqRU
— realme (@realmeIndia) August 12, 2024
Realme 13 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)
డిస్ప్లే: Realme 13 5G లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, ఎల్టీపీఎస్ ప్యానెల్ ఉంటాయి.
ప్రాసెసర్: Realme 13 5G లో ఆక్టా-కోర్ చిప్సెట్ ఉంటుంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2 గిగాహెర్ట్జ్.
మెమొరీ: Realme 13 5G డివైజ్ 6జిబి/8జిబి/12జిబి/16జిబి ర్యామ్, 128జిబి/256జిబి/512జిబి/1టిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
కెమెరా: Realme 13 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి.
బ్యాటరీ: Realme 13 5G లో పవర్ బ్యాకప్ కోసం 4880 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
కనెక్టివిటీ: Realme 13 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఉంటాయి.
ఇతర ఫీచర్లు: Realme 13 5G లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటుంది.
