Home News Realme 13 5G Series: ఆగస్టు 29న లాంచ్ అవుతోన్న రియల్మీ 13 5జీ సిరీస్

Realme 13 5G Series: ఆగస్టు 29న లాంచ్ అవుతోన్న రియల్మీ 13 5జీ సిరీస్

Highlights
  • Realme 13 5G సిరీస్ లాంచ్ తేదీ ఖరారు
  • ఆగస్టు 29న లాంచ్ అవుతోన్న సిరీస్
  • డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో 13 5జీ సిరీస్ ను లాంచ్ చేయనుంది. నేడు కంపెనీ ఈ సిరీస్ యొక్క లాంచ్ తేదీని ప్రకటించింది. రియల్మీ షేర్ చేసిన ప్రెస్ రిలీజ్ ప్రకారం, Realme 13 5G సిరీస్ ఆగస్టు 29వ తేదీన లాంచ్ అవుతోంది. రియల్మీ 12 5జీ సిరీస్ కు సక్సెసర్ గా Realme 13 5G సిరీస్ మార్కెట్ లోకి వస్తోంది. ఈ లైనప్ లో Realme 13 5G మరియు Realme 13+ 5G ఫోన్లు రానున్నట్లు సమాచారం. రియల్మీ 13 సిరీస్ ఇండియా లాంచ్ వివరాలు తెలుసుకుందాం.

Realme 13 5G సిరీస్ ఇండియా లాంచ్ తేదీ, లభ్యత

Realme 13 5G సిరీస్ స్మార్ట్‌ఫోన్లు ఆగస్టు 29వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు భారత్ లో లాంచ్ కానున్నాయి. ప్రస్తుతం ఈ ఫోన్ల యొక్క మైక్రోసైట్ ఫ్లిప్‌కార్ట్ తో పాటు రియల్మీ ఇండియా వెబ్‌సైట్ పై అందుబాటులో ఉంది. దీంతో ఈ ఫోన్ల ఆన్‌లైన్ లభ్యత కన్ఫర్మ్ అయ్యింది.

Realme 13 5G సిరీస్ ప్రాసెసర్

Realme 13 5G సిరీస్ లో రాబోవు స్మార్ట్‌ఫోన్లు ఏయే చిప్సెట్స్ తో రానున్నాయనే విషయాన్ని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్సెట్ తో వస్తోన్న ఫోన్ ఈ సిరీస్ ద్వారా విడుదలవ్వనుంది. ఈ చిప్ 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.

Realme 13 5G సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

ప్రాసెసర్: Realme 13+ 5G ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ తో వస్తున్నట్లు టీఈఎన్ఏఏ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ద్వారా తెలిసింది. చిప్సెట్ యొక్క హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.5 గిగాహెర్ట్జ్.

కెమెరా: Realme 13+ 5G లో 12.5ఎంపి ఈఐఎస్ కెమెరాతో రానుంది. పిక్సెల్-బైనింగ్ తో దీన్ని హయ్యర్ మెగాపిక్సెల్ కౌంట్ తో అమ్మే అవకాశం ఉంది.

బ్యాటరీ: Realme 13 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ వివరాలు ఇంకా తెలియదు.

బేస్ మోడల్ వివరాలు పెద్దగా తెలియదు. అయితే గతంలో బయటకు వచ్చిన కొన్ని లీక్స్ ప్రకారం, Realme 13 5G లో 6.72-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్ ఉంటాయని తెలుస్తోంది.

Realme 13 5G లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Realme 13 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ తో లాంచ్ కానుంది.