ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో Realme 13 5G సిరీస్ ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Realme 13 5G మరియు Realme 13+ 5G అనే స్మార్ట్‌ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఇప్పుడు ఈ ఆర్టికల్ లో మనం Realme 13+ 5G గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్సెట్ తో వచ్చింది. ఓసారి ఈ డివైజ్ యొక్క ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Realme 13+ 5G సేల్ వివరాలు, ధర
Realme 13+ 5G స్మార్ట్‌ఫోన్ భారత్ లో 3 వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు తెలుసుకుందాం. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.22,999 గా నిర్ణయించారు. 8జిబి+256జిబి మోడల్ ధర రూ.24,999 గా ఉంది. 12జిబి+256జిబి వేరియంట్ ధరను రూ.26,999 గా ఉంది.
సెప్టెంబర్ 6వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్ మరియు కంపెనీ యొక్క అధికార వెబ్‌సైట్ ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ కొనేవారికి రూ.1,500 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇంకా ప్రీ-బుకింగ్ ఆఫర్ లో భాగాంగా రూ.3,000 వరకు ప్రయోజనం పొందే అవకాశం ఉంది. నేటి నుంచి ప్రీ-బుకింగ్స్ మొదలయ్యాయి.
Realme 13+ 5G స్మార్ట్‌ఫోన్ విక్టరీ గోల్డ్ మరియు స్పీడ్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Realme 13+ 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Realme 13+ 5G లో 6.67-ఇంచ్ శాంసంగ్ ఈ4 అమోలెడ్ స్క్రీన్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180హెర్ట్జ్/1200హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2000 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
ప్రాసెసర్: Realme 13+ 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ615 జీపీయూ వినియోగించారు.
కెమెరా: Realme 13+ 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఎల్‌వైటీ-600 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 2ఎంపి మోనో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరాను అందించారు.
బ్యాటరీ, చార్జింగ్: Realme 13+ 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
సాఫ్ట్‌వేర్: Realme 13+ 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ తో లాంచ్ అయ్యింది.
కనెక్టివిటీ: Realme 13+ 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై 6 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
ఇతర ఫీచర్లు: Realme 13+ 5G లో ఐపీ65 రేటింగ్, రెయిన్‌వాటర్ స్మార్ట్‌టచ్ టెక్నాలజీ, వేపర్ కూలింగ్ సిస్టమ్ ఉన్నాయి.
