
స్మార్ట్‌ఫోన్ కొనే ముందు ప్రధానంగా చూసే స్పెసిఫికేషన్స్ లో బ్యాటరీ విభాగం ఒకటి. ఫోన్ ఎక్కువ సేపు వాడుకోవాలంటే, మంచి పవర్ బ్యాకప్ ఉండాలి. అంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువగా అందించే ఫోన్‌ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ లో చాలా ఫోన్లు ఉంటాయి. అందులో ఏ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంతా? అనేది వాడితే గానీ తెలియదు. అందుకే మేం ఎప్పటికప్పుడు ఫోన్ల బ్యాటరీ పెర్ఫామెన్స్ ఎలా ఉందో కొన్ని టెస్టులు జరిపి తెలుసుకుంటున్నాం.
Realme 13+ మరియు Motorola Edge 50 Fusion ఫోన్ల బ్యాటరీ పనితనాన్ని మేం కొన్ని టెస్టులు చేసి పరీక్షించాం. ఆ వివరాలను మీకోసం ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.
Realme 13+ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. మరోవైపు Motorola Edge 50 Fusion లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.
పీసీమార్క్
పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ కోసం రియల్మీ 13+ మరియు మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్లు ఫ్లైట్ మోడ్ లో పెట్టాం. అలాగే బ్రైట్నెస్ లెవెల్స్ మరియు ఆడియో లెవెల్స్ ను ఒకే విధంగా ఉంచాం. రెండు ఫోన్లు కూడా 100 శాతం చార్జింగ్ తో ఉన్నాయి.
| స్మార్ట్‌ఫోన్ | రియల్మీ 13+ | మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ |
| పీసీమార్క్ టెస్ట్ | 10 గంటల 37 నిమిషాలు | 9 గంటల 53 నిమిషాలు |
పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో రియల్మీ 13+ ఫోన్ 20 శాతానికి డ్రాప్ అయ్యేందుకు 10 గంటల సమయం పట్టింది. మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ కూడా దాదాపుగా 10 గంటల పాటు నడిచింది. రెండు ఫోన్లను పోల్చితే, రియల్మీ 13+ బెటర్ బ్యాటరీ లైఫ్ ఇస్తుందని తెలిసింది.
విజేత: Realme 13+
యూట్యూబ్ వీడియో టెస్ట్
30 నిమిషాల పాటు యూట్యూబ్ వీడియోలను చూసే టెస్ట్ కోసం, రెండు ఫోన్లలో ఒకే విధమైన బ్రైట్నెస్, ఆడియో లెవెల్స్, రెజుల్యూషన్ పెట్టడం జరిగింది.
| స్మార్ట్‌ఫోన్ | రియల్మీ 13+ | మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ |
| పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ (బ్యాటరీ ఖర్చు) | 4 శాతం | 4 శాతం |
యూట్యూబ్ వీడియో ప్లేబ్యాక్ టెస్ట్ లో రెండు స్మార్ట్‌ఫోన్లు కూడా 4 శాతం బ్యాటరీని వినియోగించుకున్నాయి. అంటే 200ఎంఏహెచ్ పవర్ ను వాడుకున్నాయి.
విజేత: సమానం
గేమింగ్
గేమింగ్ టెస్ట్ కోసం రెండు స్మార్ట్‌ఫోన్లలో ఒకే విధమైన సెట్టింగ్స్ ను పెట్టడం జరిగింది.
| స్మార్ట్‌ఫోన్ | రియల్మీ 13+ | మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ |
| గేమింగ్ తర్వాత బ్యాటరీ డ్రాప్ | 6.6 శాతం | 8.6 శాతం |
ఈ టెస్ట్ కోసం బీజీఎంఐ, రియల్ రేసింగ్ 3, కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్‌లను రెండు ఫోన్లలో ఒక్కోదానిలో 30 నిమిషాల పాటు ఆడటం జరిగింది. ఆడటం అయ్యాక, రియల్మీ 13+ లో 6.6 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది. మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ లో 8.6 శాతం బ్యాటరీ డ్రాప్ అయ్యింది. గేమర్స్‌కి రియల్మీ 13+ బెటర్ చాయిస్ అయ్యే అవకాశం ఉంది.
విజేత: Realme 13+
చార్జింగ్
రియల్మీ 13+ మరియు ఎడ్జ్ 50 ఫ్యూజన్ డివైజెస్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. అయితే, రెండు ఫోన్లు కూడా వేర్వేరు చార్జింగ్ స్పీడ్‌కి సపోర్ట్ చేస్తాయి.
| స్మార్ట్‌ఫోన్ | రియల్మీ 13+ | మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ |
| చార్జింగ్ టైమ్ (20%-100%) | 31 నిమిషాలు | 36 నిమిషాలు |
రియల్మీ 13+ 80 వాట్ చార్జర్ తో వచ్చింది. ఇది ఫోన్‌ని 31 నిమిషాల్లో 20 శాతం నుంచి 100 శాతం వరకు చార్జ్ చేస్తుంది. ఎడ్జ్ 50 ఫ్యూజన్ 68 వాట్ చార్జర్ తో వచ్చింది. 100 శాతం చార్జ్ అయ్యేందుకు ఈ ఫోన్‌కి 36 నిమిషాల సమయం పట్టింది.
విజేత: Realme 13+
ఏది బెటర్?
మేం జరిపిన టెస్ట్ ప్రకారం, Realme 13+ స్మార్ట్‌ఫోన్, Motorola Edge 50 Fusion కంటే ముందుంది. అయితే, రోజువారీ వాడకంలో రెండు ఫోన్లు కూడా ఒకే రకంగా బ్యాటరీని ఖర్చు చేశాయి. అలాగే, చార్జింగ్ స్పీడ్స్ వేరైనప్పటికీ, పూర్తిగా చార్జ్ అయ్యేందుకు రెండు ఫోన్లు దాదాపుగా ఒకే సమయాన్ని తీసుకున్నాయి.