
Realme 13+ ఫోన్ భారత్ లో రూ.22,999 ధరతో లాంచ్ అయ్యింది. అయితే ఈ ధర శ్రేణిలో రియల్మీ 13 ప్లస్‌కి మరొక ఆప్షన్‌గా Motorola Edge 50 Fusion కూడా రేసులో ఉంది. మరి, ఈ రెండింట్లో ఏది కొంటే బెటర్? ఈ విషయాన్ని తేల్చేందుకు మనం Realme 13 Plus మరియు Motorola Edge 50 Fusion ఫోన్లను అన్ని విభాగాల్లో పోల్చి చూద్దాం.
Realme 13+ vs Motorola Edge 50 Fusion: స్పెసిఫికేషన్స్
| స్పెసిఫికేషన్స్ | రియల్మీ 13 ప్లస్ | మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ |
| డిస్ప్లే | 6.67-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ అమోలెడ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 395 పీపీఐ, 1080*2400 రెజుల్యూషన్, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ | 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ పీఓఎల్ఈడీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 393 పీపీఐ, 1080*2400 రెజుల్యూషన్, 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 |
| చుట్టుకొలత | 161.7 x 74.7 x 7.6 మి.మీ | 161.9 x 73.1 x 7.9 మి.మీ |
| బరువు | 185 గ్రాములు | 174.9 గ్రాములు |
| సాఫ్ట్‌వేర్ | ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 | ఆండ్రాయిడ్ 14 ఓఎస్ |
| రియర్ కెమెరా | 50ఎంపి ఓఐఎస్, 2ఎంపి డెప్త్ | 50ఎంపి ఓఐఎస్, 13ఎంపి అల్ట్రావైడ్ |
| సెల్ఫీ కెమెరా | 16ఎంపి కెమెరా | 32ఎంపి కెమెరా |
| వీడియో | 4కే/30ఎఫ్‌పీఎస్ | 4కే/30ఎఫ్‌పీఎస్ |
| చిప్సెట్ | మీడియాటెక్ డైమెన్సిటీ 7300 | స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 |
| బ్యాటరీ, చార్జింగ్ | 5500 ఎంఏహెచ్, 80 వాట్ చార్జింగ్ | 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 68 వాట్ చార్జింగ్ |
| స్టోరేజీ | 8జిబి/12జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ | 8జిబి/12జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ |
| కలర్స్ | విక్టరీ గోల్డ్, స్పీడ్ గ్రీన్, డార్క్ పర్పుల్ | మార్ష్‌మాలో బ్లూ, ఫారెస్ట్ బ్లూ, హాట్ పింక్ |
Realme 13+ vs Motorola Edge 50 Fusion: ధర
| రియల్మీ 13+ | మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ |
| 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ధర రూ.22,999 | 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ధర రూ.22,999 |
| 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ధర రూ.24,999 | 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ధర రూ.24,999 |
| 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ధర రూ.26,999 |
Realme 13 Plus vs Motorola Edge 50 Fusion: డిజైన్
రియల్మీ 13+ డ్యూయల్-టోన్ ఫినిష్, టెక్షర్డ్ ప్యాటర్న్ తో వచ్చింది. డార్క్ పర్పుల్, విక్టరీ గోల్డ్, స్పీడ్ గ్రీన్ కలర్స్ లో లభిస్తుంది. ఇంకా ఈ ఫోన్ ఐపీ65 రేటింగ్ కలిగి ఉంది.
మరోవైపు, Motorola Edge 50 Fusion వీగన్ లెదర్ బ్యాక్ తో వచ్చింది. మార్ష్‌మాలో బ్లూ మరియు హాట్ పింక్, ఫారెస్ట్ బ్లూ కలర్స్ లో లభిస్తుంది. ఫారెస్ట్ బ్లూ వేరియంట్ మ్యాట్ ఫినిష్ తో వచ్చింది. ఈ ఫోన్ ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వచ్చింది.
Realme 13+ vs Motorola Edge 50 Fusion: డిస్ప్లే
రియల్మీ 13 ప్లస్ లో అమోలెడ్ ప్యానెల్ అందించారు. మరోవైపు, ఎడ్జ్ 50 ఫ్యూజన్ లో పీఓఎల్ఈడీ స్క్రీన్ ఉంది. ఇక్కడ రియల్మీ 13 ప్లస్‌ది కాస్త పైచేయిగా ఉంది. అయితే, ఎడ్జ్ 50 ఫ్యూజన్ లో కర్వ్డ్ ప్యానెల్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉన్నాయి. రియల్మీ 13 ప్లస్ లో ఫ్లాట్ డిస్ప్లే ఉంది.
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. రియల్మీ 13 ప్లస్ లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అందించారు.
Realme 13+ vs Motorola Edge 50 Fusion: పెర్ఫామెన్స్
రియల్మీ 13 ప్లస్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ తో వచ్చింది. మరోవైపు, మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్ అందించారు. రెండింట్లో, డైమెన్సిటీ 7300 ఎంతో శక్తివంతమైంది. ఇప్పుడు బెంచ్‌మార్క్ స్కోర్స్ చూద్దాం.
| ప్లాట్ఫామ్ | రియల్మీ 13+ | మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ |
| అంటుటు | 7,39,074 | 6,20,648 |
| గీక్‌బెంచ్ (సింగిల్-కోర్) | 1,050 పాయింట్లు | 1,020 పాయింట్లు |
| గీక్‌బెంచ్ (మల్టీ-కోర్) | 2,957 పాయింట్లు | 2,945 పాయింట్లు |
అంటుటు టెస్టులో మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ కేవలం 6,20,648 పాయింట్లు స్కోర్ చేసింది. మరోవైపు, రియల్మీ 13 ప్లస్ 7,39,074 పాయింట్లు స్కోర్ చేసింది. గీక్‌బెంచ్ లో ఎడ్జ్ 50 ఫ్యూజన్ సింగిల్-కోర్ టెస్ట్ లో 1020 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2945 పాయింట్లు స్కోర్ చేసింది. మరోవైపు, రియల్మీ 13+ సింగిల్-కోర్ టెస్ట్ లో 1,050 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2,957 పాయింట్లు స్కోర్ చేసింది.
Realme 13+ vs Motorola Edge 50 Fusion: కెమెరాలు
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. రియల్మీ 13 ప్లస్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. రియర్ కెమెరా సెటప్ విషయానికి వస్తే, రెండు ఫోన్లలో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా ఉంది. అయితే, మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ లో 13ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంది. రియల్మీ 13 ప్లస్ లో 2ఎంపి మోనోక్రోమ్ లెన్స్ ఉంది. చూస్తుంటే, మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 50ఎంపి+13ఎంపి కెమెరా యూనిట్ తో కాస్త బలంగా కనిపిస్తోంది.
Realme 13+ vs Motorola Edge 50 Fusion: బ్యాటరీ, చార్జింగ్
రియల్మీ 13+ లో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో రియల్మీ 13 ప్లస్, మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ కంటే ఎక్కువసేపు పని చేసింది.
రియల్మీ 13 ప్లస్ 10 గంటల 37 నిమిషాల పాటు పని చేసింది. మరోవైపు, మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ 9 గంటల 53 నిమిషాల పాటు పని చేసింది.
80 వాట్ చార్జర్ తో 20 శాతం నుంచి 100 శాతం వరకు చార్జ్ అయ్యేందుకు రియల్మీ 13 ప్లస్ కి 31 నిమిషాల సమయం పట్టింది.
68 వాట్ చార్జర్ తో 20 శాతం నుంచి 100 శాతం వరకు చార్జ్ అయ్యేందుకు మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ కి 54 నిమిషాల సమయం పట్టింది. చార్జ్ బూస్ట్ ఫీచర్ తో 36 నిమిషాలు పట్టింది.
రియల్మీ 13 ప్లస్ లో 30 నిమిషాల పాటు యూట్యూబ్ వీడియోలు ప్లే చేయగా, 4 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది. మరోవైపు మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ లో 5 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది.
Realme 13+ vs Motorola Edge 50 Fusion: సాఫ్ట్‌వేర్
రియల్మీ 13 ప్లస్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ తో లాంచ్ అయ్యింది. మరోవైపు, మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్టాక్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది. రియల్మీ 13 ప్లస్ రెండు మేజర్ ఆండ్రాయిడ్ ఓఎస్ అప్డేట్స్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ పొందుతుంది. మరోవైపు, మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్‌కి 3 ఏళ్ళు ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి.
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ మోటో ఏఐ ఫీచర్లతో వచ్చింది. ఫోటో ఎన్హాన్స్‌మెంట్ ఇంజిన్, వీడియో స్టెబిలైజేషన్, ఏఐ వాల్‌పేపర్స్ ఈ ఫోన్ లో లభిస్తాయి. రియల్మీ 13 ప్లస్ లో కూడా ఏఐ ఫీచర్లను అందించారు.
ఏది బెటర్?
రెండు ఫోన్లలో కూడా ప్లస్‌లు, మైనస్‌లు ఉన్నాయి. మీకు గనుక, కర్వ్డ్ ప్రొటెక్టెడ్ డిస్ప్లే, ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, బెటర్ కెమెరా సెటప్ కావాలనుకుంటే Motorola Edge 50 Fusion ను ఎంచుకోండి. అయితే, బెటర్ డిస్ప్లే ప్యానెల్, మంచి బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ చార్జింగ్ స్పీడ్ కావాలనుకుంటే Realme 13+ ను ఎంచుకోండి.











