ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో తన కొత్త నంబర్ సిరీస్ ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Realme 13 Pro మరియు Realme 13 Pro+ 5G అనే మోడల్స్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ ఆర్టికల్ లో మనం Realme 13 Pro+ 5G గురించి తెలుసుకుందాం. Realme 13 Pro కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇక Realme 13 Pro+ 5G విషయానికి వస్తే, ఈ ఫోన్ సోని ఎల్‌వైటీ కెమెరా, రూ.32,999 ప్రారంభ ధర, 512జిబి స్టోరేజీతో లాంచ్ అయ్యింది. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.
Realme 13 Pro+ 5G ధర, లభ్యత, కలర్ ఆప్షన్స్
Realme 13 Pro+ 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.32,999 గా నిర్ణయించారు. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.34,999 గా పెట్టారు. 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.36,999 గా ఉంది. మానెట్ గోల్డ్, ఎమరాల్డ్ గ్రీన్ కలర్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.
ఆగస్టు 6వ తేదీ నుంచి Realme 13 Pro+ 5G డివైజ్ సేల్‌కి వస్తోంది. లాంచ్ ఆఫర్ లో భాగంగా, రూ.3,000 డిస్కౌంట్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది.
Realme 13 Pro+ 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Realme 13 Pro+ 5G లో 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, 2412*1080 పిక్సెల్ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ఉన్నాయి.
ప్రాసెసర్: Realme 13 Pro+ 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. ఈ చిప్ హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 710 జీపీయూ వాడారు.
సాఫ్ట్‌వేర్: Realme 13 Pro+ 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 2 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.
మెమొరీ: Realme 13 Pro+ 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 12జిబి+256జిబి, 12జిబి+512జిబి వేరియంట్స్ లో లభిస్తుంది. ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు.
కెమెరా: Realme 13 Pro+ 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ-701 మెయిన్ ఓఐఎస్ కెమెరా, 50ఎంపి సోని ఎల్‌వైటీ-600 పెరిస్కోప్ ఓఐఎస్ లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఈ ఫోన్ 3ఎక్స్ ఆప్టికల్ జూమ్, 73ఎంఎం ఫోకల్ లెంగ్త్, ఇన్-సెన్సర్ జూమ్ టెక్నాలజీ వంటి ఫీచర్లకు సపోర్ట్ చేస్తుంది.
బ్యాటరీ: Realme 13 Pro+ 5G లో పవర్ బ్యాకప్ కోసం 5200 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 80 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
కనెక్టివిటీ: Realme 13 Pro+ 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
