Home News Realme 13 Pro+ 5G: లీకైన రియల్మీ 13 ప్రో ప్లస్ ర్యామ్, స్టోరేజీ, కలర్ ఆప్షన్స్

Realme 13 Pro+ 5G: లీకైన రియల్మీ 13 ప్రో ప్లస్ ర్యామ్, స్టోరేజీ, కలర్ ఆప్షన్స్

Highlights
  • త్వరలో Realme 13 Pro+ 5G లాంచ్
  • తాజాగా రివీలైన ర్యామ్, స్టోరేజీ, కలర్ ఆప్షన్స్
  • 512జిబి స్టోరేజీతో వస్తోన్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme ఈ ఏడాది ఆరంభంలో రియల్మీ 12 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఇప్పుడు Realme 13 Pro సిరీస్‌ను తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉంది. తాజాగా, 91మొబైల్స్ కి Realme 13 Pro+ 5G డివైజ్‌కి సంబంధించిన ర్యామ్, స్టోరేజీ మరియు కలర్ ఆప్షన్స్ వివరాలు అందాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.

Realme 13 Pro+ 5G వివరాలు (లీక్)

91mobiles Hindi వెబ్‌సైట్‌కి Realme 13 Pro+ 5G గురించి రిటైల్ వర్గాల నుంచి సమాచారం అందింది. ఆ సమాచారం ప్రకారం, ఈ ఫోన్ 4 మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ కానుంది. అవి: 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ.

Realme 13 Pro Plus 5G కలర్ ఆప్షన్స్

Realme 13 Pro Plus 5G స్మార్ట్‌ఫోన్ మానెట్ గోల్డ్ మరియు ఎమరాల్డ్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ కానుందని సమాచారం. లాంచ్ సమయంలో కొత్త కలర్ ఆప్షన్స్‌ను కూడా రియల్మీ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ RMX3921 అనే మోడల్ నంబర్‌ను కలిగి ఉంది.

Realme 13 Pro Plus 5G కెమెరా వివరాలు (లీక్)

Realme 13 Pro Plus 5G స్మార్ట్‌ఫోన్ కెమెరా వివరాలను ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ షేర్ చేసింది. 50ఎంపి మెయిన్ కెమెరా, 3ఎక్స్ పెరిస్కోప్ లెన్స్ ఈ ఫోన్ లో ఉంటాయని లీక్ ద్వారా తెలుస్తోంది.

Realme 12 Pro Plus 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme 12 Pro+ 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, కర్వ్డ్ ఎడ్జ్ డిస్ప్లే, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2160 పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 950 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Realme 12 Pro+ 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్, అడ్రెనో 710 జీపీయూ ఉన్నాయి.

ర్యామ్, స్టోరేజీ: Realme 12 Pro+ 5G డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 12జిబి డైనమిక్ ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Realme 12 Pro+ 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 64ఎంపి పెరిస్కోప్ లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి సోని ఐఎంఎక్స్615 ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Realme 12 Pro+ 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Realme 12 Pro+ 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.