
స్మార్ట్‌ఫోన్ కొనే ముందు ప్రధానంగా చూసే స్పెసిఫికేషన్స్ లో బ్యాటరీ విభాగం ఒకటి. ఫోన్ ఎక్కువ సేపు వాడుకోవాలంటే, మంచి పవర్ బ్యాకప్ ఉండాలి. అంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువగా అందించే ఫోన్‌ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ లో చాలా ఫోన్లు ఉంటాయి. అందులో ఏ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంతా? అనేది వాడితే గానీ తెలియదు. అందుకే మేం ఎప్పటికప్పుడు ఫోన్ల బ్యాటరీ పెర్ఫామెన్స్ ఎలా ఉందో కొన్ని టెస్టులు జరిపి తెలుసుకుంటున్నాం.
Realme 13 మరియు CMF Phone 1 ఫోన్ల బ్యాటరీ పనితనాన్ని మేం కొన్ని టెస్టులు చేసి పరీక్షించాం. ఆ వివరాలను మీకోసం ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.
Realme 13 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. మరోవైపు CMF Phone 1 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.
Realme 13 vs CMF Phone 1: ధరలు (అధికార వెబ్‌సైట్ ప్రకారం)
| స్టోరేజీ వేరియంట్స్ | రియల్మీ 13 | సీఎంఎఫ్ ఫోన్ 1 |
| 6జిబి+128జిబి | – | రూ.15,999 |
| 8జిబి+128జిబి | రూ.17,999 | రూ.17,999 |
| 8జిబి+256జిబి | రూ.19,999 | – |
పీసీమార్క్
పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ ద్వారా ఫోన్ యొక్క బ్యాటరీ 100 శాతం నుంచి 20 శాతానికి డ్రాప్ అయ్యేందుకు ఎంత సమయం పట్టిందనే విషయం తెలుస్తుంది. ఈ రెండు ఫోన్లలో మేం స్క్రీన్ బ్రైట్నెస్ 80 శాతం పెట్టాం. ఇప్పుడు టెస్టు ఫలితాలను చూద్దాం.
రెండు ఫోన్లలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నప్పటికీ సీఎంఎఫ్ ఫోన్ 1 తో పోల్చితే రియల్మీ 13 వెనుకబడింది. సీఎంఎఫ్ ఫోన్ 1 బెటర్ బ్యాటరీ ఆప్టిమైజేషన్ కలిగి ఉన్నట్లు బెంచ్‌మార్క్ ఫలితాలను చూస్తే అర్థమవుతోంది. కాబట్టి, రియల్మీ 13 కంటే సీఎంఎఫ్ ఫోన్ 1 ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఇస్తుందని తెలుస్తోంది.
| రియల్మీ 13 | సీఎంఎఫ్ ఫోన్ 1 | |
| పీసీమార్క్ స్కోర్ | 11 గంటల 12 నిమిషాలు | 15 గంటల 11 నిమిషాలు |
విజేత: CMF Phone 1
వీడియో స్ట్రీమింగ్
రెండు ఫోన్లలో 50 శాతం బ్రైట్నెస్, వాల్యూమ్ లెవెల్ ను పెట్టడం జరిగింది. తర్వాత 30 నిమిషాల పాటు యూట్యూబ్ వీడియోలను ప్లే చేయగా, రెండు స్మార్ట్‌ఫోన్లలో బ్యాటరీ 3 శాతం ఖర్చయ్యింది. మీరు తరచూ, ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో వీడియోలను చూసే వారైతే, రెండు ఫోన్లు కూడా ఒకే విధమైన వీడియో ప్లేబ్యాక్ టైమ్ అందిస్తాయి.
| రియల్మీ 13 | సీఎంఎఫ్ ఫోన్ 1 | |
| యూట్యూబ్ బ్యాటరీ డ్రాప్ | 3 శాతం | 3 శాతం |
విజేత: సమానం
గేమింగ్
రెండు స్మార్ట్‌ఫోన్లలో కాల్ ఆఫ్ డ్యూటీ: మొబైల్, రియల్ రేసింగ్ 3, బీజీఎంఐ గేమ్‌లను ఒక్కొక్క దాన్ని 30 నిమిషాల చొప్పున ఆడటం జరిగింది. ఫలితాలు చాలా ఆసక్తికరంగా వచ్చాయి. రియల్మీ 13 కొంచెమే బ్యాటరీని వాడుకుని లీడ్ లో నిలిచింది. ఈ ఫోన్ బ్యాటరీ 5.6 శాతం మాత్రమే డ్రాప్ కాగా, సీఎంఎఫ్ ఫోన్ 1 డివైజ్ 7 శాతం బ్యాటరీ శక్తిని వాడుకుంది. మీరు గనుక, ఎక్కువగా గేమ్స్ ఆడే వారైతే, రియల్మీ 13 బెటర్ చాయిస్ అవుతుంది.
| రియల్మీ 13 బ్యాటరీ డ్రాప్ | సీఎంఎఫ్ ఫోన్ 1 బ్యాటరీ డ్రాప్ | |
| కాల్ ఆఫ్ డ్యూటీ: మొబైల్ | 6 శాతం | 8 శాతం |
| రియల్ రేసింగ్ 3 | 5 శాతం | 6 శాతం |
| బీజీఎంఐ | 6 శాతం | 7 శాతం |
విజేత: Realme 13
చార్జింగ్ స్పీడ్
బ్యాటరీ లైఫ్ తో పాటు, చార్జింగ్ స్పీడ్ కూడా ముఖ్యమైన విషయమే. రియల్మీ 13 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో రాగా, సీఎంఎఫ్ ఫోన్ 1 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. రెండు ఫోన్లు కూడా 20 శాతం బ్యాటరీ పవర్ తో ఉండగా, చార్జింగ్ పెట్టడం జరిగింది. మరి 100 శాతం చేరేందుకు ఏ ఫోన్ కి ఎంత సమయం పట్టిందో తెలుసుకుందాం.
| రియల్మీ 13 | సీఎంఎఫ్ ఫోన్ 1 | |
| చార్జింగ్ టైమ్ | 57 నిమిషాలు (45 వాట్) | 63 నిమిషాలు (33 వాట్) |
ఈ టెస్టులో రియల్మీ 13 తన సత్తా చాటింది. సీఎంఎఫ్ ఫోన్ 1 పై రియల్మీ 13 పైచేయి సాధించింది. సీఎంఎఫ్ ఫోన్ 1 తక్కువ చార్జింగ్ స్పీడ్ తో రావడం తెలిసిన విషయమే. అయినప్పటికీ, సాధ్యమైనంత త్వరగానే ఫుల్ చార్జ్ చేయగలిగింది.
విజేత: Realme 13
ఏది బెటర్?
ఈ బ్యాటరీ కంపేరిజన్ ట్విస్టులతో కూడుకున్నట్లు అనిపించింది. తొలుత బెంచ్‌మార్క్ ఫలితాల్లో సీఎంఎఫ్ ఫోన్ 1 విజయం సాధించింది. కానీ, చివర్లో, రియల్మీ 13 రియల్-వరల్డ్ టెస్టులో విక్టరీ కొట్టింది. గేమింగ్ వంటి హెవీ టాస్కుల సమయంలో Realme 13 బ్యాటరీని తక్కువ వాడుకుంది. అలాగే CMF Phone 1 కంటే త్వరగా బ్యాటరీని చార్జ్ చేసింది.
మీరు క్విక్ చార్జింగ్, స్ట్రాంగ్ బ్యాటరీ లైఫ్ కోరుకుంటే Realme 13 బెటర్ ఆప్షన్ అవుతుంది.
స్మార్ట్‌ఫోన్లను టెస్ట్ చేసిన వారు: గౌరవ్ శర్మ