
Realme 13 స్మార్ట్‌ఫోన్ భారత్ లో రూ.17,999 ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్‌ని ఓ మోస్తరు ధరలో చక్కటి మిడ్-రేంజ్ ఫోన్ అని చెప్పవచ్చు. అయితే ఈ ఫోన్ తో పోటీపడేందుకు మరొక ఫోన్ CMF Phone 1 పేరుతో లాంచ్ అయ్యింది. రియల్మీ 13 లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ ఇవ్వగా, సీఎంఎఫ్ ఫోన్ 1 లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ వాడారు. నేడు ఈ రెండు ఫోన్లను మనం పోల్చి చూసి, రెండింట్లో ఏది బెటర్‌గా పెర్ఫామ్ చేస్తుందో తెలుసుకుందాం.
Realme 13 vs CMF Phone 1: ధరలు
| స్టోరేజీ వేరియంట్స్ | రియల్మీ 13 | సీఎంఎఫ్ ఫోన్ 1 |
| 6జిబి+128జిబి | రూ.15,999 | |
| 8జిబి+128జిబి | రూ.17,999 | రూ.17,999 |
| 8జిబి+256జిబి | రూ.19,999 |
గీక్‌బెంచ్
ఇప్పుడు రెండు ఫోన్ల యొక్క గీక్‌బెంచ్ స్కోర్లను చెక్ చేద్దాం. ఈ టెస్ట్ కోసం రెండు ఫోన్ల యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ ను ఎంచుకోవడం జరిగింది.
స్కోర్లను బట్టి చూస్తే, సీఎంఎఫ్ ఫోన్ 1, రియల్మీ 13 కంటే బెటర్ గా ఉన్నట్లు అర్థమవుతోంది. సింగిల్-కోర్ మరియు మల్టీ-కోర్ టెస్టుల్లో రియల్మీ 13 వెనకబడింది. సింగిల్-కోర్ పెర్ఫామెన్స్ అనేది బ్రౌజింగ్, యాప్ లోడింగ్ స్పీడ్ లపై ప్రభావం చూపుతుంది. మరోవైపు, మల్టీ-కోర్ పెర్ఫామెన్స్ వీడియో ఎడిటింగ్, గేమింగ్ వంటి హెవీ టాస్కులపై ప్రభావం చూపుతుంది. బెంచ్‌మార్క్స్ ప్రకారం, సీఎంఎఫ్ ఫోన్ 1 లో ఈ అన్నీ టాస్కులు స్మూథ్ గా నడుస్తాయని స్పష్టమవుతోంది.
| రియల్మీ 13 | సీఎంఎఫ్ ఫోన్ 1 | |
| సింగిల్-కోర్ | 782 | 1015 |
| మల్టీ-కోర్ | 1978 | 2867 |
విజేత: CMF Phone 1
అంటుటు
గీక్‌బెంచ్ కంటే మరింత లోతైన ఫలితాలను అంటుటు అందిస్తుంది. ఇది సీపీయూ, జీపీయూ, మెమొరీ మరియు యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉన్నాయో తెలియజేస్తుంది. ఇక్కడ కూడా.. అంటుటు స్కోర్ల విషయానికి వస్తే, రియల్మీ 13 పై సీఎంఎఫ్ ఫోన్ 1 పైచేయి సాధించింది.
రెండు ఫోన్ల యొక్క ఫలితాలను గమనిస్తే, సీఎంఎఫ్ ఫోన్ 1 యొక్క జీపీయూ స్కోర్ ఎక్కువగా ఉంది. ఇతర స్కోర్లు కూడా దాదాపు అదే విధంగా ఉన్నాయి. రియల్మీ 13 తో పోల్చితే, సీఎంఎఫ్ ఫోన్ 1 అన్ని విభాగాల్లోనూ బెటర్ గా పెర్ఫామర్ గా నిలిచింది.
| రియల్మీ 13 | సీఎంఎఫ్ ఫోన్ 1 | |
| అంటుటు | 4,52,218 | 6,42,187 |
విజేత: CMF Phone 1
సీపీయూ థ్రాట్లింగ్ టెస్ట్
తీవ్రమైన ఒత్తిడి పరిస్థితుల్లో స్మార్ట్‌ఫోన్ యొక్క చిప్సెట్ ఎంత బాగా పెర్ఫామ్ చేస్తుందో అనే విషయాన్ని సీపీయూ థ్రాట్లిల్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ టెస్ట్ కోసం మేము, బర్నవుట్ బెంచ్‌మార్క్ యాప్ ను ఉపయోగించాం. ఈ టెస్టులో సీఎంఎఫ్ ఫోన్ 1 కంటే రియల్మీ 13 మంచి స్కోర్ చేసింది. మీరు గనుక, రోజూ ఎక్కువగా గేమ్స్ ఆడటంతో పాటు ఇంటెన్సివ్ టాస్కులు చేస్తే, మీకు రియల్మీ 13 బాగా సరిపోతుంది.
| రియల్మీ 13 | సీఎంఎఫ్ ఫోన్ 1 | |
| ఒత్తిడి సమయంలో పెర్ఫామెన్స్ ఔట్‌పుట్ | 63.5 | 58.2 |
విజేత: Realme 13
గేమింగ్ టెస్ట్
మేం రెండు ఫోన్లలోనూ ఒక్కో దానిలో 30 నిమిషాల చొప్పున కాల్ ఆఫ్ డ్యూటీ, రియల్ రేసింగ్ 3, బీజీఎంఐ గేమ్‌లను ఆడాం. ఈ మూడు గేముల్లోనూ సీఎంఎఫ్ ఫోన్ 1 బెటర్ గా పెర్ఫామ్ చేసింది. హీట్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే.. 90 నిమిషాల గేమింగ్ సెషన్ తర్వాత, రియల్మీ 13 యొక్క టెంపరేచర్ 15.3 డిగ్రీలు పెరిగింది. సీఎంఎఫ్ ఫోన్ 1 యొక్క టెంపరేచర్ 14.6 డిగ్రీలు పెరిగింది.
థర్మల్స్ విషయానికి వస్తే, రెండు ఫోన్లలో పెద్దగా తేడా లేదు. అయితే, మీరు గనుక రోజూ గేమ్స్ ఆడే వారైతే, మీకు సీఎంఎఫ్ ఫోన్ 1 బెటర్ ఆప్షన్ అవుతుంది.
| రియల్మీ 13 | సీఎంఎఫ్ ఫోన్ 1 | |
| 90 నిమిషాల గేమింగ్ తర్వాత టెంపరేచర్ | 5.1 డిగ్రీల సెల్సియస్ | 4.86 డిగ్రీల సెల్సియస్ |
విజేత: CMF Phone 1
ఏది బెటర్?
అన్ని ఫలితాలను బట్టి చూస్తే, Realme 13 పై CMF Phone 1 విజయం సాధించిందని అర్థమవుతోంది. మంచి బెంచ్‌మార్క్ ఫలితాలను సీఎంఎఫ్ ఫోన్ 1 కలిగి ఉంది. గేమింగ్ పెర్ఫామెన్స్ కూడా బాగుంది. హీట్ మేనేజ్మెంట్ ఫర్వాలేదు. రెండు ఫోన్లలో CMF Phone 1 బెటర్ చాయిస్ అని చెప్పవచ్చు. మరో విషయం ఏంటంటే, దీని ధర కూడా తక్కువే.
ఈ స్మార్ట్‌ఫోన్లను టెస్ట్ చేసిన వారు: గౌరవ్ శర్మ