హైలైట్స్:
- భారత్ లో లాంచ్ అయిన రియల్ మీ 9ఐ స్మార్ట్ ఫోన్
- 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్సెట్, 50ఎంపి ట్రిపుల్ కెమెరాస్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
- భారత్ లో రియల్ మీ 9ఐ ఫోన్ ధర రూ.13,999 నుంచి ప్రారంభం
రియల్ మీ 9ఐ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్ లో లాంచ్ అయ్యింది. ఇది రియల్ మీ నుంచి వచ్చిన లేటెస్ట్ బడ్జెట్ 5జీ స్మార్ట్ ఫోన్. దేశంలో రియల్ మీ 9ఐ 4జీ ఫోన్ ని లాంచ్ చేశాక కొన్ని నెలలకు ఈ 5జీ వర్షన్ ని రియల్ మీ లాంచ్ చేసింది. ఈ హ్యాండ్సెట్ మనకు తొలి వింటేజ్ సీడీ డిజైన్ ని తీసుకొచ్చింది. ఎంఈటీ గాలా 2022 ట్రెండ్ స్పూర్తి తో ఈ డిజైన్ ను రూపొందించారు. కాంతి తగిలినప్పుడు సీడీ మాదిరిగానే ఫోన్ బ్యాక్ ప్యానెల్ రంగు మెరుస్తూ, మారుతూ ఉంటుంది. ఇక సెల్ఫీ స్నాపర్ కోసం ముందువైపున వాటర్ డ్రాప్ నాచ్ ఉంది. అలాగే భద్రత కొరకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. బ్యాక్ ప్యానెల్ పై మూడు కెమెరాల కటౌట్ ఉంది.
6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్సెట్, 50ఎంపి ట్రిపుల్ కెమెరాస్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 128జిబి స్టోరేజీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రధాన ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.
భారత్ లో Realme 9i ధర, అమ్మకపు వివరాలు
రియల్ మీ 9ఐ 5జీ 4జిబి + 64జిబి మోడల్ ధర రూ.14,999 గా ఉంది. 6జిబి + 128జిబి వేరియంట్ ధర రూ.16,999 గా ఉంది. ఫ్లిప్ కార్ట్, రియల్ మీ వెబ్ సైట్స్, ఆఫ్ లైన్ స్టోర్స్ ద్వారా ఆగస్టు 24 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. హెచ్డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్స్ ద్వారా కంపెనీ రూ.1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ని ఆఫర్ చేస్తోంది.
Realme 9i 5G స్పెసిఫికేషన్స్
రియల్ మీ 9ఐ స్మార్ట్ ఫోన్లో 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90.5 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, 400 నిట్స్ బ్రైట్నెస్, మీడియాటెక్ డైమెన్సిటీ 810 ఆక్టా-కోర్ ప్రాసెసర్, మాలి-జీ57 ఎంసీ2 950మెగాహెర్ట్జ్, 6జిబి వరకు ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ, ఎక్స్‌పాండబుల్ మెమొరీ, 3జిబి వర్చువల్ ర్యామ్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.
రియల్ మీ 9ఐ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12, రియల్ మీ యూఐ 3.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, బ్లూటూత్ 5.2, డ్యూయల్-బ్యాండ్ వైఫై, డ్యూయల్ సిమ్, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. భద్రత కొరకు ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. ఇందులో 5000ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
రియల్ మీ 9ఐ లో ట్రిపుల్ కెమెరాలు ఉన్నాయి. ఇందులో ఒకటి 50ఎంపి ప్రైమరీ కెమెరా కాగా, రెండోది 2ఎంపి మ్యాక్రో లెన్స్, మూడోది 2ఎంపి పోట్రెయిట్ లెన్స్. అలాగే వెనకాల ఎల్ఈడీ ఫ్లాష్ ని అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ముందు వైపున 8 ఎంపి కెమెరాను అందించారు.