Home News లాంచ్ కి ముందు లీకైన Realme 9i 5G రెండర్స్

లాంచ్ కి ముందు లీకైన Realme 9i 5G రెండర్స్

హైలైట్స్:

రియల్ మీ కంపెనీ నుంచి వస్తున్న కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రియల్ మీ 9ఐ 5జీ ఆగస్టు 18 న భారత్ లో లాంచ్ అవుతోంది. అయితే ఫోన్ మరికొన్ని రోజుల్లో లాంచ్ అవుతోందనగా, ఫోన్ రెండర్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. లీక్స్ ద్వారా ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్, లేజర్ లైట్ డిజైన్ కనిపించాయి. బ్లాక్, గోల్డ్ కలర్ వేరియంట్స్ లో ఈ హ్యాండ్సెట్ లభించనుంది. ఫ్లిప్ కార్ట్ లో ఇప్పటికే ఈ ఫోన్ కి సంబంధించిన ఒక మైక్రోసైట్ కనిపిస్తోంది.

Realme 9i 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

రియల్ మీ 9ఐ 5జీ మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్సెట్ ను కలిగి ఉండనుంది. అలాగే 8జిబి వరకు ర్యామ్, 128జిబి స్టోరేజీ ఈ ఫోన్లో ఉంటాయి. ఈ హ్యాండ్సెట్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. లుక్స్ పరంగా చూస్తే, ఈ హ్యాండ్సెట్ రియల్ మీ 9ఐ 4జీ మోడల్ మాదిరి కనిపిస్తున్నాయి. రియల్ మీ 9ఐ కొన్ని వారాల క్రితమే లాంచ్ అయ్యింది.

ట్విట్టర్ లో టిప్ స్టార్ సుదాన్శు అంభోరే షేర్ చేసిన రెండర్స్ ని బట్టి, రియల్ మీ 9ఐ 5జీ నలుపు, బంగారు వర్ణాల్లో లభించనుంది. ఇదివరకు అనుకున్నట్లు, రెండర్స్ లో ట్రిపుల్ కెమెరా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ ఫోన్లో 50ఎంపి ప్రైమరీ సెన్సర్, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉండే అవకాశముంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ ముందు వైపున 16ఎంపి కెమెరాను అమర్చారు.

ఫ్లాట్ సైడ్స్ తో పాటు, ఈ స్మార్ట్‌ఫోన్ లో కుడివైపున పవర్ బటన్, ఎడమవైపున వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. ఇక ముందు వైపు డిజైన్ ని గమనిస్తే, బాటమ్ లో భారీగా చిన్ కనిపిస్తోంది. సెల్ఫీ కెమెరా కోసం డ్యూ-డ్రాప్ నాచ్ ఉంది. ఇక డిస్ప్లే సైజ్ గురించి పూర్తి వివరాలు తెలియదు. అయితే, 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే ఇందులో ఉండే అవకాశముంది. ఆండ్రాయిడ్ 11 ఓఎస్, రియల్ మీ యూఐ 2.0 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది. రియల్ మీ 9ఐ 5జీ ఫోన్ ధర దాదాపు రూ.15,000 ఉండే అవకాశముంది.

Realme 9i 5G స్పెసిఫికేషన్స్

ఆగస్టు 18 న ఉదయం 11.30 గంటలకు రియల్ మీ 9ఐ 5జీ ఫోన్ లాంచ్ కానుంది. ఫోన్ లాంచ్ సమయం దగ్గరపడుతున్న కొద్దీ మరింత సమాచారం తెలుస్తాయి.