హైలైట్స్
- రూ.7499 ప్రారంభ ధరతో భారత్ లో లాంచ్ అయిన Realme C30s
- 6.5-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 5ఎంపి సెల్ఫీ కెమెరా ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
- సెప్టెంబర్ 23 నుంచి ఫ్లిప్ కార్ట్, రియల్మీ వెబ్ సైట్ ద్వారా సేల్ కి రానున్న Realme C30s

రియల్మీ సీ-సిరీస్ పోర్ట్‌ఫోలియోలో కొత్తగా Realme C30s వచ్చి చేరింది. ఎంట్రీ-లెవెల్ సెగ్మెంట్ లో ఈ హ్యాండ్సెట్ లాంచ్ అయ్యింది. జూన్ లో లాంచ్ అయిన రియల్మీ సీ30 కాస్త మెరుగులు దిద్ది Realme C30s తీసుకొచ్చినట్లు అనిపిస్తోంది. Realme C30s కొత్త చిప్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, కొత్త డిజైన్ తో వస్తోంది. అక్కడా ఇక్కడా కొన్ని మార్పులు తప్పితే, Realme C30s సేమ్ బాక్సీ డిజైన్, వాటర్ డ్రాప్ నాచ్, సింగిల్ సర్క్యూలర్ కెమెరా, ఫ్లాష్ ని కలిగి ఉంది. Realme C30s లో 8ఎంపి రియర్ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. Realme C30s ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్మీ యూఐ గో ఎడిషన్ పై పని చేస్తుంది.
Realme C30s లో గ్రీన్ కలర్ ఆప్షన్ కి బదులు బ్లాక్ కలర్ ఆప్షన్ ని అందించారు. Realme C30 లో గ్రీన్ కలర్ ఆప్షన్ ఉన్న సంగతి తెలిసిందే. ఏదేమైనా, ఇది రియల్మీ నుంచి వచ్చిన కొత్త హ్యాండ్సెట్ కాబట్టి ఇతర విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
భారత్ లో Realme C30s ధర, లభ్యత
సెప్టెంబర్ 23 నుంచి రియల్మీ అధికార వెబ్ సైట్ ద్వారా మరియు ఫ్లిప్ కార్ట్ ద్వారా Realme C30s ని కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్సెట్ రెండు మోడల్స్ లో లభ్యమవుతుంది. 2జిబి ర్యామ్ + 32జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.7,499 గా నిర్ణయించారు. 4జిబి + 64జిబి వేరియంట్ ధర రూ.8,999 గా ఉంది. Realme C30s రెండు రంగుల్లో దొరుకుతుంది. అవి: స్ట్రైప్ బ్లూ, స్ట్రైప్ బ్లాక్.

Realme C30s స్పెసిఫికేషన్స్
Realme C30s లో 6.5 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 400 నిట్స్ బ్రైట్నెస్, యూనిసాక్ ఎస్‌సీ9863ఏ ఆక్టా-కోర్ ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ చార్జింగ్ సపోర్ట్, 2జిబి/4జిబి ర్యామ్, 32జిబి/64జిబి స్టోరేజీ, ఎస్డీ కార్డ్ ద్వారా ఎక్స్‌పాండబుల్ మెమొరీ ఆప్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Realme C30s లో 8ఎంపి రియర్ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. Realme C30s ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్మీ యూఐ గో ఎడిషన్ పై పని చేస్తుంది.
Realme C30s లో 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జ్యాక్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, బ్లూటూత్ 4.2, డ్యూయల్ సిమ్ కార్డ్ సపోర్ట్ ఉన్నాయి. Realme C30s ఫోన్ 8.5 మిల్లీ మీటర్ల మందం, 182 గ్రాముల బరువు ఉంటుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.











