Realme C51: 6.74-ఇంచ్ డిస్ప్లే, 50MP కెమెరాతో భారత్‌లో లాంచైన రియల్మీ సీ51

Highlights

  • నేడు భారత్ లో లాంచైన Realme C51
  • 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చిన డివైజ్
  • 4జిబి+64జిబి వేరియంట్ ధర రూ.8,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో Realme C51 డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ డ్యూయల్-టెక్షర్ డిజైన్ బ్యాక్ ప్యానెల్ ని కలిగి ఉంది. ఐఫోన్ లో మాదిరి ఈ రియల్మీ ఫోన్ లో మినీ-క్యాప్సూల్ డిజైన్ అందించారు. దీని ద్వారా బ్యాటరీ స్టేటస్, డేటా యూసేజ్, స్టెప్ కౌంట్ వంటి ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. Realme C51 డివైజ్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, 50ఎంపి ప్రైమరీ కెమెరాతో వచ్చింది.

భారత్ లో Realme C51 ధర, సేల్

  • భారత్ లో Realme C51 డివైజ్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.8,999 గా నిర్ణయించారు.
  • Realme C51 స్మార్ట్ ఫోన్ కార్బన్ బ్లాక్, మింట్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • సెప్టెంబర్ 4 వ తేదీ అనగా నేడు సాయంత్రం 6 గంటల నుంచి ఎర్లీ బర్డ్ సేల్ అందుబాటులో ఉంటుంది.
  • ఫ్లిప్‌కార్ట్, రియల్మీ వెబ్‌సైట్స్ ద్వారా Realme C51 డివైజ్ సేల్ కి అందుబాటులో ఉంటుంది.
  • Realme C51 ఫోన్ పై ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్‌సీ కార్డ్స్ ద్వారా రూ.5,00 డిస్కౌంట్ ని కంపెనీ ఆఫర్ చేస్తోంది.

Realme C51 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Realme C51 స్మార్ట్ ఫోన్ లో 6.7-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 560 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Realme C51 లో యూనిఎస్ఓసీ టీ612 ఆక్టా-కోర్ 12 నానోమీటర్ ప్రాసెసర్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 జీపీయూ వినియోగించారు.
  • ర్యామ్, స్టోరేజీ: Realme C51 లో 4జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 64జిబి స్టోరేజీ అందించారు. ఇంకా 4జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంది. అలాగే మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 2టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.
  • ఓఎస్: Realme C51 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ టీ ఎడిషన్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Realme C51 డివైజ్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, ఒక ఎల్ఈడీ ఫ్లాష్, సెకండరీ డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Realme C51 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • డైమెన్షన్స్: Realme C51 డివైజ్ 167.2 మి.మీ పొడవు, 76.7 మి.మీ వెడల్పు, 7.99 మి.మీ మందం, 186 గ్రాముల బరువు ఉంది.
  • కనెక్టివిటీ: Realme C51 స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, గ్లొనాస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Realme C51 డివైజ్ లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఇంకా అల్ట్రాబూమ్ స్పీకర్ కూడా ఈ ఫోన్ లో ఉంది.
Previous articleలీకైన Vivo V29 5G ఇండియా లాంచ్ టైమ్‌లైన్, గ్లోబల్ లాంచ్ తేదీ!
Next article33W ఫాస్ట్ చార్జింగ్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో లాంచైన Oppo A38
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.