గత కొన్ని రోజులుగా Realme C51 కి సంబంధించిన వార్తలు హడావుడి చేస్తున్నాయి. ఎట్టకేలకు Realme C51 డివైజ్ టెక్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ రియల్మీ తైవాన్ అధికార వెబ్ సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ధర వివరాలు బయటకు వచ్చాయి. సీ-సిరీస్ లో వచ్చిన Realme C51 ఫోన్ లో పలు ప్రత్యేకతలు ఉన్నాయి. అవి: 50ఎంపి కెమెరా, 33 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్. సరే, ఇతర స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
Realme C51 ధర, లభ్యత
Realme C51 స్మార్ట్ ఫోన్ మింట్ గ్రీన్, కార్బన్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ మోడల్ ధర NT$ 3,990 (రూ.10,430) గా ఉంది. తైవాన్ లో జులై 25 నుంచి ఈ ఫోన్ సేల్స్ మొదలుకానున్నాయి. అయితే ఇప్పటి వరకు ఇండియా లాంచ్ పై ఇంకా సమాచారం లేదు. కానీ, త్వరలోనే భారతీయ మార్కెట్ లోకి కూడా Realme C51 ఫోన్ ప్రవేశించనుందని ఆశిస్తున్నాం.
Realme C51 స్పెసిఫికేషన్స్
Realme C51 డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Realme C51 స్మార్ట్ ఫోన్ లో 6.7-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. Realme C51 డివైజ్ లో డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, గ్లొనాస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి. సరే, పూర్తి స్పెసిఫికేషన్స్ పాయింట్ల రూపంలో క్రింద చూడండి.
- డిస్ప్లే: Realme C51 స్మార్ట్ ఫోన్ లో 6.7-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- ప్రాసెసర్: Realme C51 లో యూనిఎస్ఓసీ టీ612 ఆక్టా-కోర్ 12ఎన్ఎమ్ ప్రాసెసర్ వాడారు. గ్రాఫిక్స్ కోసం ఈ ఫోన్ లో మాలి-జీ57 జీపీయూ అందించారు.
- ర్యామ్, స్టోరేజీ: Realme C51 హ్యాండ్సెట్ లో 4జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 64జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 2టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.
- కెమెరా: Realme C51 స్మార్ట్ ఫోన్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, ఒక డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి కెమెరా అందించారు.
- బ్యాటరీ: Realme C51 డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Realme C51 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ టీ ఎడిషన్ పై పని చేస్తుంది.
- కనెక్టివిటీ: Realme C51 డివైజ్ లో డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, గ్లొనాస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
