నేడు భారత్ లో Realme C53 స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ నయా ఫోన్ స్టైలిష్ లుక్, గ్రేట్ స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. ఈ ఫోన్ 108 మెగా పిక్సెల్ కెమెరా, డైనమిక్ ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ టెక్నాలజీ తో మార్కెట్ లోకి వచ్చింది. తక్కువ ధరలో అద్భుతమైన కెమెరా, అధిక ర్యామ్ ఫోన్ కోసం చూసే వారికి Realme C53 ఉత్తమమైన ఆప్షన్ గా నిలుస్తుందని చెప్పవచ్చు. సరే మరి, ఓసారి Realme C53 ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Realme C53 ధర
Realme C53 స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.9,999 గా నిర్ణయించారు. మరోవైపు 6జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.10,999 గా ఉంది. జులై 26 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా Realme C53 డివైజ్ సేల్ మొదలవుతుంది. ఛాంపియన్ గోల్డ్, ఛాంపియన్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. ప్రారంభ సేల్ లో భాగంగా, కంపెనీ 6జిబి ర్యామ్ వేరియంట్ పై 1,000 డిస్కౌంట్ అందిస్తోంది.
Realme C53 కెమెరా
- 108ఎంపి రియర్ కెమెరా
- 8ఎంపి ఫ్రంట్ కెమెరా
Realme C53 స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ఎస్5కేహెచ్ఎం6 సెన్సర్ ఉంది. ఇది F/1.75 అపర్చర్ కలిగి ఉంది. ఈ సెన్సర్ 3x ఇన్-సెన్సర్ జూమ్ కి సపోర్ట్ చేస్తుంది. దీనికి తోడు ఒక బ్లాక్ అండ్ వైట్ లెన్స్ కూడా అందించారు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
Realme C53 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Realme C53 లో 6.74-ఇంచ్ హెచ్డీ డిస్ప్లే, 720*1600 పిక్సెల్ రెజుల్యూషన్, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 560 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Realme C53 స్మార్ట్ ఫోన్ లో UNISOC T612 ఆక్టా-కోర్ చిప్ వాడారు. ఈ చిప్ 1.82 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని కలిగి ఉంది.
- ర్యామ్, స్టోరేజీ: Realme C53 డివైజ్ 4జిబి/6జిబి ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తోంది. ఇంకా 6జిబి వరకు డైనమిక్ ర్యామ్ ని అందిస్తోంది. అంటే 6జిబి వేరియంట్ తీసుకున్న వారు ర్యామ్ ని 12జిబి వరకు పెంచుకోవచ్చు.
- బ్యాటరీ: Realme C53 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Realme C53 స్మార్ట్ ఫోన్ లో మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ఉంది. దీని ద్వారా మెమొరీని 2టిబి వరకు పెంచుకునే వీలుంది. 150 శాతం అల్ట్రాబూమ్ స్పీకర్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఈ ఫోన్ లో ఉన్నాయి.
