Realme C55 ఇండియా లాంచ్ టైమ్‌లైన్, స్పెసిఫికేషన్స్

Highlights

  • మార్చి నెలలో భారత్ లో లాంచ్ కానున్న Realme C55 స్మార్ట్ ఫోన్
  • ఈ ఫోన్‌దే అని భావిస్తోన్న అన్-బాక్సింగ్ వీడియో ద్వారా రివీల్ అయిన ఫుల్ ఫోన్ లుక్
  • 6.72-ఇంచ్ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 64ఎంపి ప్రైమరీ కెమెరా, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోన్న Realme C55

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Realme త్వరలో Realme C55 డివైజ్ ని భారత్ లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ హ్యాండ్సెట్ బెంచ్ మార్కింగ్ సైట్ గీక్ బెంచ్ డేటాబేస్ పై కనిపించింది. ఇప్పుడు లాంచ్ అనౌన్స్‌మెంట్ వస్తుందనగా, Realme C55 దే అని చెప్పబడుతోన్న ఒక అన్‌బాక్సింగ్ వీడియో నెట్టింట్లో ప్రత్యక్షమైంది. టిప్‌స్టర్ పారస్ గుగ్లాని ద్వారా Realme C55 యొక్క లాంచ్ టైమ్ లైన్ వివరాలు లీకైయ్యాయి.

iPhone 14 Pro లో మనకు కనిపించే డైనమిక్ ఐల్యాండ్ మాదిరి డిజైన్ ని Realme C55 లో మనం చూడవచ్చు. నోటిఫికేషన్స్, చార్జింగ్ అలర్ట్స్ ఈ డైనమిక్ ఐల్యాండ్ వంటి ఫీచర్ ద్వారా చూపబడతాయి.

Realme C55 అన్‌బాక్సింగ్ వీడియో ద్వారా స్పెసిఫికేషన్స్ పై ఓ అవగాహన వచ్చింది. ఈ ఫోన్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 64ఎంపి మెయిన్ కెమెరా వంటి ఫీచర్లతో రానున్నట్లు సమాచారం.

Realme C55 లాంచ్ టైమ్‌లైన్

Realme C55 స్మార్ట్ ఫోన్ భారత్ లో మార్చి నెలలో లాంచ్ కాబోతున్నట్లు టిప్ స్టర్ పారస్ గుగ్లాని తెలిపాడు. ఇతడు ఒక టీజర్ వీడియో ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దీంతో ఫోన్ యొక్క ఫుల్ లుక్ బయటకు వచ్చింది.

Realme C55 డిజైన్

Realme C55 స్మార్ట్ ఫోన్ లో సెంటర్-పొజిషన్డ్ పంచ్-హోల్ కటౌట్, ఫ్లాట్ ఎడ్జెస్, న్యారో బెజెల్స్ ఉన్నాయి. ఈ ఫోన్ బాక్సీ డిజైన్, రౌండెడ్ ఎడ్జెస్, కంఫర్టబుల్ గ్రిప్ ని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్, స్పీకర్ గ్రిల్ బాటమ్ లో కనిపిస్తున్నాయి. వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ కుడివైపున ఉన్నాయి. పవర్ బటన్ లోనే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఎంబెడ్ చేయబడి ఉంది. ఫోన్ కి ఎడమవైపున సిమ్ ట్రే సెక్షన్ ఉంటుంది.

Realme C55 లో బ్యాక్ ప్యానెల్ పై రెండు భారీ సర్క్యులర్ రింగ్స్ లో కెమెరా యూనిట్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్ గ్లిట్టరీ డిజైన్ ని కలిగి ఉంది. ఈ డిజైన్ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

Realme C55 స్పెసిఫికేషన్స్

Realme C55 స్మార్ట్ ఫోన్ 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, సెంటర్-పొజిషన్డ్ పంచ్-హోల్ కటౌట్, ఫ్లాట్ బెజెల్స్ తో వస్తోంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్ వాడినట్లు సమాచారం. 6జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి ఈఎంఎంసీ 5.1 స్టోరేజీ ఈ ఫోన్ లో ఉండనున్నాయి.

Realme C55 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్ లో 64ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. త్వరలోనే Realme C55 కి సంబంధించిన వివరాలు తెలియనున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.