Home News 64ఎంపి కెమెరాతో భారత్ లో లాంచైన Realme C55

64ఎంపి కెమెరాతో భారత్ లో లాంచైన Realme C55

Highlights
  • 16జిబి డైనమిక్ ర్యామ్ సపోర్ట్ తో వచ్చిన Realme C55 డివైజ్
  • 90 హెర్ట్జ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 33 వాట్ ఫాస్ట్ సూపర్‌వూక్ చార్జింగ్ తో లాంచైన Realme C55
  • రెండు మెమొరీ వేరియంట్స్ లో లభించనున్న Realme C55

Realme సంస్థ నేడు భారత్ లో Realme C55 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. దీంతో రియల్మీ పోర్ట్‌ఫోలియో భారత్ లో మరింత పెరిగినట్లైంది. ఈ ఫోన్ లో-బడ్జెట్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ మార్కెట్ లోకి వచ్చింది. Realme C55 లో 64ఎంపి రియర్ కెమెరా, 16జిబి డైనమిక్ ర్యామ్ ఉన్నాయి. ఈ ఫోన్ కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Realme C55 స్పెసిఫికేషన్స్

Realme C55 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ88 చిప్సెట్ తో లాంచైంది. ఈ ఫోన్ రెండు మెమొరీ వేరియంట్స్ లో వచ్చింది. అవి: 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ. Realme C55 లో 8జిబి డైనమిక్ ర్యామ్ టెక్నాలజీ కూడా ఉంది. దీంతో ఫోన్ 16జిబి వరకు ర్యామ్ తో పని చేస్తుంది.

Realme C55 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా, మరొక సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. రియల్మీ అధికార వెబ్ సైట్ ప్రకారం, Realme C55 డివైజ్ 1080*2400 పిక్సెల్ రెజుల్యూషన్ తో కనిపిస్తోంది. ఈ స్క్రీన్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది.

Realme C55 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్ లో 3.5ఎంఎం ఆడియో జాక్, ఎన్‌ఎఫ్‌సీ ఉంటాయి. ఈ ఫోన్ మందం 7.89 మిల్లీ మీటర్లుగా ఉంటుంది. Realme C55 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.