Realme సంస్థ త్వరలో లాంచ్ కాబోయే Realme C55 స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీ, ప్రధాన స్పెసిఫికేషన్స్ ని అధికారికంగా కన్ఫర్మ్ చేసింది. రియల్మీ ఇండోనేషియా వెబ్‌సైట్ లో Realme C55 ప్రోమో పేజీ ప్రస్తుతం దర్శనమిస్తోంది. దీని ప్రకారం, Realme C55 డివైజ్ మార్చి 7 న లాంచ్ అవుతున్నట్లు తెలుస్తోంది. లాంచ్ తేదీ తో పాటు, ప్రధాన స్పెసిఫికేషన్స్ కూడా రివీల్ అయ్యాయి. ఓసారి Realme C55 యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందా పదండి.
Realme C55 స్పెసిఫికేషన్స్
- 6.72-inch FHD+ డిస్ప్లే
- 90Hz రిఫ్రెష్ రేట్
- MediaTek Helio G88
- Android 13, Realme UI 4.0
- 6GB/8GB, 128GB/256GB
- 64MP మెయిన్ కెమెరా
- 8MP సెల్ఫీ కెమెరా
- 5000mAh బ్యాటరీ
- 33W ఫాస్ట్ చార్జింగ్
Realme C55 స్మార్ట్ ఫోన్ లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 680 నిట్స్ పీక్ బ్రైట్నెస్, పంచ్ హోల్ డిజైన్, మినీ క్యాప్సూల్ ఫీచర్, ఆండ్రాయిడ్ 13, రియల్మీ యూఐ 4.0 ఉన్నాయి. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ88 చిప్సెట్ ఉంటుంది. 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది. వర్చువల్ ర్యామ్ సపోర్ట్, మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ ఈ ఫోన్ లో ఉన్నాయి. 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.
Realme C55 లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి కెమెరా ఉంటుంది. పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందిస్తున్నారు.
Realme C55 హ్యాండ్సెట్ లో NFC, 3.5mm ఆడియో జాక్, USB Type-C పోర్ట్ ఉంటాయి. ఈ స్మార్ట్ ఫోన్ 7.89 మిల్లీ మీటర్ల మందం ఉంటుంది. Realme C55 డివైజ్ రెయినీ నైట్, సన్‌షవర్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. భారత్ లో మార్చి 7 న ఈ ఫోన్ లాంచ్ కానుందని సమాచారం. అయితే రియల్మీ ఇండియా ఇంకా అధికార ప్రకటన చేయలేదు.
త్వరలోనే రియల్మీ నుంచి Realme C55 లాంచ్ కి సంబంధించి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇండోనేషియాలో మార్చి 7 న Realme C55 లాంచ్ సమయంలో ఇండియా లాంచ్ కి సంబంధించి స్పష్టత వచ్చే చాన్సెస్ ఉన్నాయి. లేదంటే అదే రోజున భారత్ లో కూడా లాంచ్ కావొచ్చు.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.
