Realme C63 5G: ఆగస్టు 12న భారత్‌లో లాంచ్ అవుతోన్న రియల్మీ కొత్త ఫోన్

Highlights

  • Realme C63 5G లాంచ్ తేదీ ఖరారు
  • ఆగస్టు 12 న ఫోన్ విడుదల
  • టీజర్ షేర్ చేసిన రియల్మీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme జులై నెలలో Realme C63 స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. అది 4జీ టెక్నాలజీతో వచ్చింది. ఇప్పుడు Realme C63 5G ఫోన్‌ని లాంచ్ చేసేందుకు రియల్మీ సిద్ధమవుతోంది. తాజాగా ఈ ఫోన్ యొక్క లాంచ్ తేదీని సంస్థ టీజర్ ద్వారా ప్రకటించింది. ఆగస్టు 12వ తేదీన భారతీయ మార్కెట్ లో Realme C63 5G లాంచ్ అవుతోంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Realme C63 5G లాంచ్ తేదీ ఖరారు

Realme C63 5G స్మార్ట్‌ఫోన్ యొక్క టీజర్‌ను తన అధికార వెబ్‌సైట్ పై రియల్మీ విడుదల చేసింది.

టీజర్ ఇమేజ్ లో ఆగస్టు 12వ తేదీన Realme C63 5G లాంచ్ అవుతుందని పేర్కొనబడి ఉంది.

Realme C63 5G డివైజ్ గోల్డెన్ మరియు గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో టీజర్ పై కనిపించింది.

Realme C63 5G డివైజ్.. స్విఫ్ట్, స్మూథ్ మరియు 5జీ ఛాంపియన్ అని తన పోస్ట్ లో కంపెనీ పేర్కొంది.

Realme C63 5G డిజైన్

Realme C63 5G ఫోన్ డిజైన్ ని గమనిస్తే, బ్యాక్ ప్యానెల్ పై స్క్వేర్ షేప్ లో కర్వ్డ్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో డ్యూయల్ కెమెరా సెటప్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. ఫ్రంట్ లో పంచ్ హోల్ డిస్ప్లే ఉంది. ఈ ఫోన్‌ని చూస్తుంటే, గ్లోబల్ గా లాంచైన Realme V60 మాదిరి కనిపిస్తోంది. ఓసారి వీ60 స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

Realme V60 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme V60 లో 6.67-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, 720*1604 పిక్సెల్స్ రెజుల్యూషన్, 625 నిట్స్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Realme V60 లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వాడరాు. ఇది ఆక్టా-కోర్ చిప్.

స్టోరేజీ: Realme V60 డివైజ్ 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీని కలిగి ఉంది.

కెమెరా: Realme V60 లో 32ఎంపి ప్రైమరీ కెమెరా ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Realme V60 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.

కనెక్టివిటీ: Realme V60 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

Previous articleVivo V40 Pro: డైమెన్సిటీ 9200+ చిప్‌తో భారత్‌లో లాంచైన వివో వీ40 ప్రో
Next articleRedmi Note 14 5G 3సీ సర్టిఫికేషన్ వివరాలు
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.